రోడ్ షోలో అలీతో పాటు వైఎస్ జగన్ పై కూడా పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. తండ్రి శవం దొరకకముందే సీఎం కావాలనుకున్న జగన్.. రాష్ట్రానికి అవసరమా అని ఎద్దేవా చేశారు.
ప్రముఖ కమెడియన్, వైఎస్సార్సీపీ నేత అలీపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ కొన్ని రోజుల క్రితం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే.. పవన్, అలీ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా అలీ జనసేనలో చేరుతారని అంతా అనుకున్నారు. కానీ.. అలీ మాత్రం జనసేన కంటే వైసీపీలో చేరడానికే ఆసక్తి కనబర్చారు. అలీ వైసీపీలో చేరినా.. ఇప్పటి వరకు అలీ మాటెత్తని పవన్.. తాజాగా అలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కష్టాల్లో అలీకి అండగా ఉన్నా. స్నేహమంటే ఇదేనా? అలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారు. అలీకి ఎంపీ టికెట్ ఇస్తామంటే అలీ వైసీపీలో చేరాడు. జగన్ బలమైన నాయకుడని అలీ భావించాడు. అందుకే వైసీపీలో చేరాడు. జనసేనలోనే అలీ చేరాలన్న నియమమేమీ లేదు. అలీ వ్యక్తిగత అభిప్రాయం అది. ఆయన నిర్ణయం ఆయన ఇష్టం. అలీ వేరే పార్టీలో చేరినంత మాత్రాన నాకేం నష్టం లేదు.. అని పవన్ కల్యాణ్ అన్నారు. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న పవన్ పై వ్యాఖ్యలు చేశారు.
తండ్రి శవం దొరక్కముందే సీఎం కావాలనుకున్న జగన్ రాష్ట్రానికి అవసరమా?
రోడ్ షోలో అలీతో పాటు వైఎస్ జగన్ పై కూడా పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. తండ్రి శవం దొరకకముందే సీఎం కావాలనుకున్న జగన్.. రాష్ట్రానికి అవసరమా అని ఎద్దేవా చేశారు. కన్నబాబు లాంటి చెంచాలు అవసరం లేదు. వైఎస్ బావమరిది రవీంద్రారెడ్డి సినిమా తీయాలంటూ బెదిరించారు. జగన్ ఇంట్లో వాటా ఇమ్మంటే ఇస్తారా? బెదిరిస్తే తోలు తీస్తా.. అని పవన్ హెచ్చరించారు.