నిరుద్యోగ సమస్యపై పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

-

కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ పోరు కొనసాగుతోంది. నిరుద్యోగ సమస్యపై పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నలుగురు ఎంపీలు గెలిచారు… కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వడం లేదని ప్రజల్ని రెచ్చగొడుతున్నారని.. బీజేపీ ఎంపీలు సిగ్గు శరం లేదని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. పరిశ్రమలు మూతపడుతున్నా… బీజేపీ ఎంపీలు స్పందించడం లేదని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలో ఉన్న ఉద్యోగులను ఎప్పుడు భర్తీ చేస్తారని అడిగినా… కనీసం ఎప్పుడు భర్తీ చేస్తారని స్టేట్మెంట్ ఇవ్వండి అని అడిగిానా… సభలో పట్టించుకోలేదని నామా నాగేశ్వర్ రావు అన్నారు. మేం ఎంత అరిచినా.. మొరపెట్టుకున్నా.. పార్లమెంట్లో  కనికరం లేకుండా చేశారని.. అందుకే పార్లమెంట్ నుంచి వాకౌట్ చేశాం అని నామా అన్నారు. రైల్వే ఉద్యోగాల  గురించి బీహార్ లో ఏం జరిగిందో చూశాం… తొక్కిసలాటలో ఇబ్బంది పడి పలువురు చనిపోయారని.. ఇదే పరిస్థితి భారతదేశం మొత్తం ఉందని.. ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news