ఎన్టీఆరే దిక్కు.. సీన్ రిపీట్ చెయ్యాల్సిందేనా..?

Join Our Community
follow manalokam on social media

టీడీపీకి సార‌థి మారాల్సిన స‌మ‌యం వ‌చ్చిందా.. తెలుగు దేశం మ‌ళ్ళీ పుంజుకోవాలంటే త‌ప్పదు మ‌రి.. ఒక‌ప్పుడు టీడీపీ ప‌రిస్థితి చేజారిపోతుంద‌ని ఎన్టీఆర్‌ చేతి నుంచి పార్టీని దక్కించుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత పార్టీ ఒడిదుడుకులకు లోనైనా కార్యకర్తల బలంతోనే నిలదొక్కుకుంది. ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు, తనయుడు లోకేష్ నిర్ణయాలు చూసిన కేడర్ ఇక జూనియర్ మాత్రమే పార్టీని కాపాడగలరన్న నిర్ణయానికి వచ్చారు..?

చంద్రబాబు బ్యాడ్ టైం ఒకరకంగా 2018 నుంచి ప్రారంభమైంది. వైసీపీ ప్యూహంలో చిక్కుకుని బీజేపీ బంధాన్ని తెంచేసుకున్నపుడే చంద్రబాబు రాజకీయ వ్యూహం ఎంత పేలవంగా ఉందో అర్ధమైందని చర్చించుకుంటున్నారు టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఆ తర్వాత వరస తప్పులు చేస్తూ ఏపీలో టీడీపీని చాపచుట్టేసే స్థితికి చంద్రబాబు తెచ్చారని అంటున్నారు. పరిషత్ ఎన్నికలు బహిష్కరించామని గొప్పగా చెప్పుకుంటున్నా చంద్రబాబు భజన బ్యాచ్ ఈ నిర్ణయం వల్ల లాభపడింది ఎవరన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. టీడీపీ ఎన్నికల్లో పాల్గొనకపోతే లాభం చేకూరేది రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ జనసేన కూటమికే అని లెక్కలేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

చంద్రబాబు తాను ఎన్నికల రేసులో లేను ఓట్లేయవద్దు అనడం ద్వారా అసలుకే ఎసరు తెచ్చుకున్నారన్న చర్చ మొదలైంది. టీడీపీ క్యాడర్ మాత్రం నేతల దగ్గర తమ గోడు వెళ్లబోసుకుంటోంది. ఏడాది కాలంగా ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో డబ్బు ఖర్చుపెట్టుకున్నామని, అప్పులు చేసి మరీ నోట్లు పంచామని.. ఇప్పుడు తమ పరిస్థితేంటని లబోదిబోమంటున్నారు టీడీపీ కేడర్. వారి దుస్థితి చూడలేక కొందరు సీనియర్ నేతలు గళం సవరించారు. ఇప్పటి వ‌ర‌కు కింది స్థాయి క్యాడ‌ర్ వ‌ల్లే న‌డుస్తూ వ‌స్తున్న టీడీపీ..ఇప్పుడు ఆ క్యాడ‌ర్‌ను కోల్పోయే ప‌రిస్థితిని తెచ్చుకుంది.

ఇక టీడీపీ పార్టీ నుండి పోటీ చేయాల‌నుకున్న నాయ‌కులు జ‌న‌సేనవైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మొన్న జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన స‌త్తా చాటింది. ఇప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. అసలు పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయం పై సైతం రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. చంద్రబాబు నిర్ణయాన్ని సమావేశంలో అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్యచౌదరి, యనమల రామకృష్ణుడు, కూన రవికుమార్ లాంటి వారు విభేదించినట్లు తెలుస్తుంది. బాబు తీసుకున్న నిర్ణయంతో లోకేష్ కూడా విభేదించిన‌ట్లు తెలుస్తుంది.

ఇప్పటికైన మేల్కొని పార్టీ పుట్టి పుర్తిగా మునగక ముందే పార్టీ ఎన్టీఆర్ చేతిలో పెట్టడం బెటరని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు చర్చించుకుంటున్నారట. త‌ప్పో ఒప్పో జూనియ‌ర్ ఎన్టీఆర్ టీడీపీని చేజిక్కించుకోవాల్సిందే.. వైశ్రాయ్ సీన్ రిపీట్ చేసినా త‌మ పార్టీ బ్రతుకుతుందనే అనుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ఎందుకంటే అప్పుడు బాబు చేసిన సీన్ ఇప్పుడు జూనియ‌ర్ చేసినా త‌ప్పేమీ కాదు… అప్పుడు బాబు చేసినా.. ఇప్పుడు జూనియ‌ర్ చేసినా.. అంతా పార్టీ మంచికేగా..

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...