ఈటలపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు : అస్సలు బాగుపడడు !

హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పై ఎమ్మెల్సీ కల్వకుంట కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. హుజురాబాద్ లో మళ్ళీ టీఆరెస్ పార్టీ గెలవడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు. ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఈటెల రాజేంద్రన్న ప్రజలకు చెప్పలేకపోతున్నారని చురకలు అంటించారు కవిత. రెఫరెండం అని ఎవరు పడితే వాళ్లు అనుకుంటే కాదు ..ప్రజలు అనుకోవాలి కదా అని ప్రశ్నించారు..

అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండం అవుతాయి కానీ .., మధ్యలో వచ్చే ఉప ఎన్నికలు కాదని ఎద్దేవా చేశారు కవిత. బిజెపి మాకు ప్రధాన పోటీ దారు అని మేము అనుకోవడం లేదని… టీఆరెస్ నుండి బయటకు వెళ్లి విమర్శించిన వాళ్ళు బాగుపడ్డట్లు చరిత్రలో లేదని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ కి కేసీయార్ ఒక వజ్రాయుధమని… టీఆరెస్ పార్టీని దేశం లోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని.. వరంగల్ విజయ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు కవిత.