కమ్మ వర్సెస్ రెడ్డి: ఫ్యాన్‌పై సైకిల్ రివెంజ్‌?

-

ఏపీ రాజకీయాలు ప్రధానంగా రెండు కులాల మధ్య వార్‌లాగా నడుస్తున్న విషయం తెలిసిందే. గత రెండు, మూడు దశాబ్దాల నుంచి ఏపీలో ఇదే సీన్..కమ్మ వర్సెస్ రెడ్డి. ఈ రెండు వర్గాల మధ్యే రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఆ రెండు వర్గాల మధ్యే అధికారం కూడా చేతులు మారుతూ ఉంది. టీడీపీ అధికారంలో ఉంటే కమ్మ, కాంగ్రెస్ అధికారంలో ఉంటే రెడ్డి వర్గాల డామినేషన్ ఉంటుంది. కాంగ్రెస్ కనుమరుగయ్యాక రెడ్డి వర్గం వైసీపీకి సపోర్ట్‌గా ఉంటూ వస్తుంది.

ycp-tdp
ycp-tdp

అయితే ఇక్కడ రాజకీయంగా ఒకరినొకరు చెక్ పెట్టడానికి వర్గాలనే టార్గెట్ చేసి ముందుకెళ్తారు. కమ్మ వర్గాన్ని దెబ్బకొడితే టీడీపీకి డ్యామేజ్ జరిగినట్లే…అలాగే రెడ్డి వర్గానికి షాక్ ఇస్తే వైసీపీకి ఇబ్బంది. అందుకే గత ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా కమ్మ నేతలని టార్గెట్ చేసి రాజకీయం చేసింది. అలాగే వారిని చాలా వరకు దెబ్బకొట్టగలిగింది. జగన్ దెబ్బకు చాలామంది కమ్మ నేతలు ఓటమి పాలయ్యారు. ఆ దెబ్బతో టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది.

ఇక ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి టీడీపీ రెడీ అవుతుంది. రెడ్డి వర్గం నాయకులకు చెక్ పెడితే వైసీపీకి చెక్ పడినట్లే. ఇప్పుడు వైసీపీలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు.

ఆ రెడ్డి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడానికి టీడీపీ కొత్త వ్యూహాలతో ముందుకొస్తుంది. రెడ్డి ఎమ్మెల్యేలని నిలువరించగలిగితే, వైసీపీని నిలువరించినట్లే..అందుకే వారిని టార్గెట్ చేసుకుని టీడీపీ ముందుకెళుతుంది. పైగా రెడ్డి ఎమ్మెల్యేల ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ తరుపున కూడా రెడ్డి నేతలనే నిలబెట్టడానికి రెడీ అయింది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ తరుపున రెడ్డి నేతలనే బరిలో దింపి, వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టే దిశగా వెళుతున్నారు. మరి చూడాలి టీడీపీ, వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలకు ఏ మేర చెక్ పెడుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news