మ‌రో వివాదంలో చిక్కుకున్న కౌశిక్‌రెడ్డి.. ఈసారి కూడా ఆడియో లీక్‌తోనే!

-

తెలంగాణ రాజ‌కీయాలు రోజురోజుకూ అట్టుడికి పోతున్నాయి. రోజుకో కొత్త మ‌లుపుతో కొత్త వివాదాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్య చాలామంది నేత‌లు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇదే క్ర‌మంలో నిన్న మొన్న‌టి దాకా హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ చార్జి అయిన కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy) కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ అనూహ్యంగా ఆయ‌న ఆడియో రీసెంట్‌గా లీక్ కావ‌డంతో ఆయ‌న భ‌విష్య‌త్ మ‌లుపు తిరిగింది.

ఆ వీడియోలో ఆయ‌న‌కు టీఆర్ ఎస్ టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని, ఓ బీజేపీ కార్య‌క‌ర్త‌తో మాట్లాడటంతో ఆయ‌న టీఆర్ ఎస్‌లోకి వెళ్తున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఇక దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియ‌స్ గా తీసుకోవ‌డంతో కౌశిక్‌రెడ్డి రాజీనామా కూడా చేశారు. దీంతో ఆయ‌న టీఆర్ ఎస్‌లో చేర‌డం ఖాయ‌మ‌నే అనుమానాల‌కు మ‌రింత బ‌లం చేకూరింది. ఇక ఇప్పుడు తాజాగా మ‌రో వివాదంలో ఆయ‌న చిక్కుకున్న‌ట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌కు రాజీనామా చేశా కౌశిక్ స్థానికంగా ఉన్న కొత్తపల్లికి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయ‌కుడు తిరుపతితో ఫోన్ లో ఫోన్‌లో మాట్లాడుతూ త‌న త‌ప్పు లేద‌ని, రేవంత్ వ‌ల్లే రాజీనామా చేశాన‌ని చెప్పుకొచ్చారు. ఓవైపు నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ ఎస్‌, బీజేపీ జోరుగా ప్ర‌చారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడిగా ఉన్న రేవంత్ మాత్రం త‌న‌ను అభ్యర్థిగా కూడా ప్రకటించకుండా, అలాగే ఇన్ చార్జుల‌ను నియ‌మించ‌కుండా కావాల‌నే రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్ల రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని, కాబ‌ట్టి త‌న‌కు అండ‌గా ఉండాల‌ని నాయ‌కుల‌ను కోరుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఆడియో ఇప్పుడు లీక్ కావ‌డంతో ఆయ‌న మ‌రింత వివాదంలో చిక్కుకున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌పై మ‌రింత సీరియ‌స్ అయ్యేలా క‌నిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news