బీఆర్ఎస్ సీట్లపై ట్విస్ట్‌లు..39 నెంబర్ పైనే కేసీఆర్.!

-

వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్ధులకు చెక్ పెట్టడం ఎంత ముఖ్యమో..బలమైన నేతలకు సీట్లు ఇవ్వడం కూడా కేసీఆర్‌కు అంత ముఖ్యం. ప్రత్యర్ధులని నిలువరించాలంటే..వారిని టార్గెట్ చేయడం కాదు..సొంత పార్టీలోని తప్పిదాలని సరిచేసుకోవాలి..అప్పుడు బి‌ఆర్‌ఎస్ పార్టీ మూడోసారి గెలిచి అధికారంలోకి రాగలుగుతుంది. రెండుసార్లు అధికారంలో ఉండటంతో సాధారణంగా ప్రభుత్వ అనుకూలం, ప్రభుత్వ వ్యతిరేక వర్గం ఉంటుంది.

అనుకూల వర్గం ఎక్కువ ఉంటే ఇబ్బంది లేదు..కానీ వ్యతిరేక వర్గం ఎక్కువ ఉంటేనే రిస్క్. ప్రస్తుతం వ్యతిరేక వర్గం కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పరంగానే చిక్కులు  ఉన్నట్లు తెలుస్తుంది. వరుసగా రెండుసార్లు గెలిచిన కొందరు ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అలాంటి వారికి మళ్ళీ సీటు ఇస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీ గెలవడం కష్టమని కే‌సి‌ఆర్‌కు రిపోర్టులు అందాయని తెలిసింది. మొత్తం బి‌ఆర్‌ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 20 పైనే ఎమ్మెల్యేల పనితీరు దారుణంగానే ఉందని తెలిసింది.

brs party
brs party

వారికి మళ్ళీ సీటు ఇస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం. అందుకే కే‌సి‌ఆర్ వారిని మార్చే దిశగానే ముందుకెళుతున్నట్లు తెలుస్తుంది. అయితే దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని తెలుస్తుంది. మిగిలిన 39 సీట్ల విషయంలో కే‌సి‌ఆర్ ఆచి తూచి అడుగులేసేలా ఉన్నారు. బలమైన అభ్యర్ధులని బరిలో దించే విధంగా ఆయన వ్యూహాలు ఉన్నాయి. అదే సమయంలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలతో పొత్తు ఉంటే..వారికి ఎన్ని సీట్లు కేటాయిస్తారనే లెక్కలు వస్తున్నాయి.

ఆ రెండు పార్టీలు కూడా సీట్లు గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వారు డిమాండ్లు ఒప్పుకోకపోతే పొత్తు నుంచి తప్పుకుంటారు.  ఇప్పుడున్న పరిస్తితుల్లో కమ్యూనిస్టులతో పొత్తు కే‌సి‌ఆర్‌కు అవసరమే కాబట్టి వారిని ఈజీగా వదులుకునే అవకాశాలు లేవు. వారికి సీట్లు సర్దుబాటు చేయాలి..అలాగే కొందరు సిట్టింగులని సైడ్ చేసి బలమైన నేతలని బరిలో దింపాలి. అన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటేనే గెలుపు సాధ్యం.

Read more RELATED
Recommended to you

Latest news