ఆ పత్రిక మీద మండిపడుతోన్న కే‌సి‌ఆర్ ??

తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఓ ఎల్లోమీడియా పత్రిక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి కోసం ప్రజల మధ్య ఎటువంటి భేషజాలు రాకుండా నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో అనేక విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ పై బురద చల్లడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో పండగలో పాల్గొనడం జరిగింది.

Related image

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి అలాగే పరిపాలన గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడటం జరిగింది. ఇటువంటి తరుణంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి పశ్చిమగోదావరి జిల్లా నేతలు తులాభారం తో సత్కరించారు. దీంతో టిడిపి చంద్రబాబు అండగా ఉండే ఎల్లో మీడియా పత్రిక ఆంధ్ర ప్రజలను తిట్టే తెలంగాణ మంత్రులను వైసీపీ పార్టీ నేతలు తలపైన పెట్టుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానిస్తున్నారని రాతలు రాయడం తో ఆ రాతలపై పత్రిక పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం.

 

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో బతికుంటే ఎల్లో మీడియా పత్రికలకు నచ్చదు కేవలం చంద్రబాబు పరిపాలించాలి అని మీ ఉద్దేశం అంటూ సదరు ఎల్లో మీడియా పత్రికా యజమాని పై కేసీఆర్ సీరియస్ అయినట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినబడుతున్న టాక్.