హీటెక్కిన టీ పాలిటిక్స్: కేసీఆర్ ఎత్తుకు కమలం పై ఎత్తు?

-

ఎప్పుడైతే దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలిచిందో అప్పటినుంచి… తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గానే సాగుతున్నాయి. రెండు పార్టీల మధ్య వార్ ఓ రేంజ్‌లో జరుగుతూ వస్తుంది. ఇక హుజూరాబాద్ ఉపఎన్నిక సమయానికి ఇది మరింత పీక్స్‌కు వెళ్లింది. అసలు రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి వచ్చింది. అసలు హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ డైరక్ట్‌గా రంగంలోకి దిగేసి…బీజేపీని టార్గెట్ చేసి రాజకీయం నడిపిస్తున్నారు.

cm kcr bjp party

అటు బీజేపీ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనేలా ముందుకెళుతుంది. కేసీఆర్ ఎత్తులకు బీజేపీ పై ఎత్తులు వేస్తుంది. పైగా కేసీఆర్ రంగంలోకి దిగడంతో బీజేపీలో డైరక్ట్‌గా జాతీయ నాయకులే రంగంలోకి దిగేశారు. ఎలాగైనా కేసీఆర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా జాతీయ నాయకులు తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వారికి ధీటుగా ముందుకెళ్లాలని కేసీఆర్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న జాతీయ పార్టీలతో కలిసి ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలువురు నేతలతో టచ్‌లో ఉన్నారు.

ఇక తాజాగా అయితే కమ్యూనిస్టు నేతలతోనే సమావేశమయ్యారు. కమ్యూనిస్ట్ జాతీయ నేతలతో సమావేశమై…దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టారు. ఇటు బీజేపీ సైతం కేసీఆర్‌కు చెక్ పెట్టడమే దిశగా పనిచేస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలపై అమిత్ షా గట్టిగానే ఫోకస్ చేశారు. ఆయన డైరక్షన్‌లోనే బీజేపీ నేతలు పనిచేస్తున్నారు.

అలాగే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం..బండి సంజయ్ అరెస్ట్ అయినప్పుడు తెలంగాణలో బీజేపీని ముందుండి నడిపించారు. ఇక తర్వాత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్…తెలంగాణలో అడుగుపెట్టారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గూప్పించారు. ఇక వరుసపెట్టి అస్సాం సీఎం, ఇంకా ఇతర జాతీయ నేతలు తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య వార్ తీవ్రంగా నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news