టీడీపీకి షాక్ ఇచ్చిన కేసినేని నానీ…!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు, ప్రభుత్వంలో కూడా సంచలనం సృష్టించిన ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై విజయవాడ ఎంపీ కేసినేని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ఓటమికి ప్రధాన కారణమైన అధికారిని సస్పెండ్ చేసారు ఏంటీ అంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు నానీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ కూడా చేసారు.

“మీరు ముఖ్యమంత్రి అవ్వటానికి మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ!!!” అంటూ కేసినేని నానీ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

వాస్తవానికి ఏబీ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు అనే పేరు ఉంది. ఈ తరుణంలో ఆయన్ను సస్పెండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై ఏబీ ఒక లేఖ విడుదల చేసారు. బంధు మిత్రులను, హితులను ఉద్దేశించి… రాష్ట్ర ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కబురు మీ వరకు చేరే ఉంటుంది. మీడియాలో వస్తున్న కథనాలలో వాస్తవం లేదని చెప్పడం ఈ లేఖ ఉద్దేశం.

దీని వలన నాకు మానసికంగా వచ్చిన ఇబ్బంది ఏమీ ఇబ్బంది. దీని గురించి మీరు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ చర్యను ఎదుర్కోవడానికి గాను చట్టపరంగా నాకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాను. తదుపరి ఏంటీ అనేది క్రమంగా మీకే తెలుస్తుంది. అంటూ ఆయన లేఖ విడుదల చేసారు. ఇక ఆయన హయాంలో అక్రమాలు జరిగాయి అంటూ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది.