నా వల్ల కాదంటున్న కేసినేని…?

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు విషయంలో ఎక్కువగా దృష్టిపెట్టాలి. ప్రధానంగా విజయవాడ వర్గ విభేదాలు విషయంలో ఆయన దృష్టి పెట్టకపోవడంతో చాలామంది నాయకులు విజయవాడలో ఇబ్బంది పడుతున్నారనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. చాలా మంది నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో విజయవాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది.

ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మీద సీరియస్ గా ఉన్నారని సమాచారం. ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా ఊహించని విధంగా పాల్గొన లేదనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో తన సన్నిహిత నేతలు పార్టీలో ఇమడలేక పోతున్నారు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తె ఓటమి కోసం కొంతమంది గట్టిగా కష్టపడ్డారని…

ఒక వైసీపీ ఎమ్మెల్యేకి ప్రోత్సాహం అందించారని బయట నుంచి విజయవాడ నగరంలో అడుగుపెట్టిన సదరు ఎమ్మెల్యే తో కొన్ని రోజుల నుంచి కొంతమంది నేతలు చర్చలు జరుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తను ఎలాగైనా సరే ఎన్నికల్లో ఎంపీగా గెలవకుండా చేయడానికి కష్టపడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కేశినేని నాని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఈ విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని కేసినేని నాని వాళ్ళ వద్ద సీరియస్ గానే చెప్పారట.

Read more RELATED
Recommended to you

Latest news