కొడాలి-వంశీలతో పాటే ఆ ఎమ్మెల్యేకు నో డౌట్.!

-

కొడాలి నాని, వల్లభనేని వంశీ..ఇద్దరు కమ్మ సామాజికవర్గం నేతలు..అలాగే వైసీపీలో ఫైర్ బ్రాండ్లు…ఇక ఈ ఇద్దరు తమ సొంత వర్గానికి చెందిన టి‌డి‌పి అధినేత చంద్రబాబుని ఏ స్థాయిలో తిడతారో చెప్పాల్సిన పని లేదు. సొంత వర్గం కాబట్టే ఆ రేంజ్ లో టార్గెట్ చేసి బాబుపై విరుచుకుపడతారు. ఇక ఈ ఇద్దరే టి‌డి‌పికి పెద్ద తలనొప్పిగా ఉన్నారు. అందుకే వీరికి రాజకీయంగా చెక్ పెట్టాలని టి‌డి‌పి గట్టిగానే ప్రయత్నిస్తుంది. వీరిని ఎన్నికల్లో ఓడిస్తేనే వెనక్కి తగ్గుతారని చూస్తున్నారు.

కానీ ఆ పరిస్తితి ఏ మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ ఇద్దరు దూకుడుగానే ఉన్నారు. తమ తమ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. గుడివాడలో కొడాలి నానికి ఎదురులేదు. ఇటు గన్నవరంలో వంశీకి తిరుగులేదు. వీరిని ఓడించడం టి‌డి‌పికి సాధ్యం కాదు. వీరితో పాటు కృష్ణా జిల్లాలో మరో వైసీపీ ఎమ్మెల్యేని ఓడించడం టి‌డి‌పికి సాధ్యమయ్యే పని కాదు. ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు గ్రామం ఉన్న పామర్రు నియోజకవర్గంలో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ మళ్ళీ వైసీపీ గెలిచేలా ఉంది.

అసలు ఇంతవరకు అక్కడ టి‌డి‌పి గెలవలేదు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఈ సారి కూడా డౌట్ లేకుండా వైసీపీ గెలవడం ఖాయమని తెలుస్తుంది. అక్కడ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌కు మళ్ళీ గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ పోటీ చేసిన గడ్డ గుడివాడలో కొడాలి ఐదోసారి గెలవడం ఖాయమని అంటున్నారు.

ఆ పక్కనే ఉండే గన్నవరంలో వంశీ ఈ సారి వైసీపీ నుంచి గెలవడం ఫిక్స్ అంటున్నారు. ఇలా మూడు స్థానాల్లో వైసీపీకి ఎదురులేదు. ఆ మూడు స్థానాల్లో విశేషం ఏంటంటే..కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువ..అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ. అయినా సరే ఆ మూడు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version