తెలంగాన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ లేదని బీజేపీ మాకే మధ్య పోటీ ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మేము గతంల నుంచి చెబుతున్నాం… ధాన్యం కొనుగోలుకు రెండు మూడు వేల కోట్ల కన్నా ఎక్కువ భారం పడదని చెబుతున్నామని కోమటి రెడ్డి అన్నారు. ఢిల్లీలో కేసీఆర్ షో చేసి… నేనే బీజేపీ ఆల్టర్నేట్ అని, రైతు సంఘాలను కూడగడతా అని చెబుతున్నారని.. ఇది కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగం అని విమర్శించారు. తెలంగాణలో 60 శాతం కౌలు రైతుల ఉంటారని… ముందుగా నష్టపోయేది కౌలు రైతులే అని అన్నారు. లక్ష రూపాయల రుణాలు మాఫీ అని అన్నావు… ఇంకా చేయలేదని కేసీఆర్ ని విమర్శించారు. రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకున్నారని… రైతులు రూ. 1400 లకే అమ్ముకున్నారని.. వారికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వమని ప్రభుత్వమే సంతకం చేసిందని కోమటిరెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ నాటకం ఆడుతున్నారని విమర్శించారు.
ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ నాటకం ఆడుతున్నారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-