బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను చనిపోతే.. నా చావును కోరిన మూర్ఖుడికే నా పేరుమీద ఉన్న ఇన్సూరెన్స్ కు ఇచ్చే డబ్బులు ఇవ్వాల్సిందిగా నా భార్య కు చెబుతానని బండి సంజయ్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం మరింత పతనం కావాలని తాను అభిలషిస్తున్నట్లు చెప్పారు.
బీజేపీ పోరాటం వల్లే కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు చేస్తుండని అన్నారు. బీజేపీ నాయకుల పోరాటంతో సీఎం కేసీఆర్ మెడలు వంచామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం తోనే కొనుగోలు చేయిస్తామని చెప్పామని గుర్తు చూశారు.
వరి వేస్తే ఉరి అని చెప్పన సీఎం కేసీఆర్ నొటి నుంచే.. వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించేలా చేశామని అన్నారు. బీజేపీ పొగ పెట్టడం వల్లే కేసీఆర్ దిగివచ్చాడని అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే భయంతోనే ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 97 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.