ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇన్నేళ్లు మునుగోడు గురించి పట్టించుకోని సీఎం ఇవాళ సభకు ఎలా వస్తారని నిలదీశారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వని సీఎం కేసీఆర్.. మునుగోడులో అడుగు ఎలా పెడతారనిప్రశ్నించారు.
సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గానికి ఎంత ఖర్చు చేశారో… మునుగోడుకి ఎంత మేరకు నిధులు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులు కేటాయించనందుకు మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని అన్నారు.
సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గానికి ఎంత ఖర్చు చేశారో… మునుగోడుకి ఎంత మేరకు నిధులు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని శాసనసభ వేదికగా ప్రశ్నించినా… రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు.
నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వని సీఎం కేసీఆర్.. మునుగోడు ఎలా వస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నిధులు కేటాయించనందుకు మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్‌షా సమక్షంలో భారీగా చేరికలున్నాయని.. అందుకు భయపడే.. కేసీఆర్ రేపు సభ ఏర్పాటు చేసుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ ఆరోపించారు.