వైఎస్సార్‌ను తలపిస్తున్న రేవంత్‌: కొండ సురేఖ

Join Our Community
follow manalokam on social media

మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ రాజశేఖర్‌ రెడ్డిని తలపిస్తున్నాడని కాంగ్రెస్‌ నాయకురాలు కొండ సురేఖ వ్యాఖ్యానించారు. తెలంగాణలో రైతుల కోసం రేవంత్‌ రెడ్డి చేస్తున్న పాదయాత్రలో కొందరు వ్యతిరేకిస్తున్నారని.. కానీ కేసీఆర్‌ ను గద్దె దించాలంటే అది మాస్‌ లీడర్‌ అయిన రేవంత్‌ రెడ్డితోనే సాధ్యమన్నారు. తెలంగాణ వాసులు కూడా కేసీఆర్‌ను ఢీ కొట్టాలంటే మాస్‌ లీడరే సరిపోతారని అలాంటి లీడర్‌ కాంగ్రెస్‌లో రేవంత్‌ ఒక్కడే నని ఆమె అన్నారు.

విమర్శించిన వారే తోడయ్యారు..

కాంగ్రెస్‌లో ఏ పదవి ఇచ్చారో ముఖ్యం కాదని.. నాడు వైఎస్‌ కూడా పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ ఓ స్థాయికి చేర్చారని, ఇప్పుడు కూడా రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్‌ను ఉన్నతస్థాయికి చేర్చేలా ప్రతి చెమట చుక్కను దారపొయాలన్నారు. గతంలో వైఎస్‌ పాదయాత్ర చేస్తున్నపుడు అది గిట్టక విమర్శలు చేసిన వారు కూడా ఆయనకు తోడు నిలిచారన్నారు. రేవంత్‌ రెడ్డి పాదయాత్రలో కూడా ఎవరైతే విమర్శిస్తున్నారో తర్వాత వారు సైతం రేవంత్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు.

కేసీఆర్‌పై ఫైర్‌..

ఇటీవల ముగిసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు అవకాశం లేకపోవడంతో వరదసాయం పేరుతో పదివేలు పంచారన్నారు. నోటిఫికేషన్‌ ముందు డబ్బులు అందజేశారని, మిగిలిన వారికి ఎన్నికలైన తర్వాత ఇస్తామని ఎన్నికలు ముగిసిన తర్వాత బాధితులపై కన్నెత్తి చూడలేదని ధ్వసమెత్తారు. ఇలా ప్రజలను తియ్యటి మాటలతో మభ్యపెడుతున్నారని అలాంటి వారిని గద్దె దించాలంటే మనమందరం ఒకే వేదికపై ఉండాలన్నారు. కేసీఆర్‌ రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి ఆస్వాదించి ఇప్పుడు తన కొడునును ఆ సీటుపై కూర్చొబెట్టేందుకు నానా ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. ఏదీ ఏమైనా తెలంగాణలో టీర్‌ఎస్‌ను గద్దె దించాలంటే అది కేవలం రేవంత్‌ రెడ్డికే సాధ్యమన్నారు.

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...