కౌంటర్: బాబు నవ్వుకు..కేటీఆర్ నవ్వు ..!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ ‘బీఆర్ఎస్’ పార్టీ పెద్ద హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ ఇకపై జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకుంటున్నారు. మోదీ సర్కార్‌ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఏపీలో కూడా బలపడాలని కేసీఆర్ భావిస్తున్నారు.

 

ఇప్పటికే అక్కడ కొందరు నేతలని టచ్‌లో పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో విజయవాడలో భారీ సభ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీని టార్గెట్ చేసి కేసీఆర్ ఏ స్థాయిలో మాట్లాడారో అందరికీ తెలిసిందే. అలా మాట్లాడినా కేసీఆర్..ఏపీలో ఎలా అడుగుపెడతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ వచ్చినా, ఇంకా ఎవరు వచ్చినా తమకు నష్టమేమీ లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు.

ఇదే క్రమంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై స్పదించమని..టీడీపీ అధినేత చంద్రబాబుని ఇటీవల మీడియా ప్రతినిధులు కోరారు. దీనికి సమాధానంగా బాబు ఒక నవ్వు నవ్వి వదిలేశారు. దీంతో కేసీఆర్‌ని బాబు లైట్ తీసుకున్నారని, అలాగే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం ఉండదనే కోణంలో బాబు రియాక్ట్ అయ్యారని మీడియా కథనాలు ఇచ్చింది.

అయితే తాజాగా బీఆర్ఎస్ గురించి జగన్-చంద్రబాబులతో గాని మాట్లాడారా? అని మీడియా కేటీఆర్‌ని ప్రశ్నించింది. జగన్ విషయానికొచ్చేసరికి..సమయం వచ్చినప్పుడు చెబుతామని మాట్లాడిన కేటీఆర్.. విలేకరులు బాబును అడిగితే నవ్వారు కదా? నా సమాధానం కూడా నవ్వే అని బదులు ఇచ్చారు. అంటే దీనికి అర్ధం ఏంటి అని ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తమని తక్కువ అంచనా వేస్తే బాబు రిస్క్‌లో పడతారని పరోక్షంగా కేటీఆర్ సెటైర్ వేశారు. లేక దారుణమైన పరిస్తితుల్లో ఉన్న బాబు నవ్వడం ఏంటి అని కేటీఆర్ నవ్వుతో సమాధానం ఇచ్చారో క్లారిటీ లేదు. మొత్తానికి బీఆర్ఎస్ ఎంట్రీ ఏపీలో ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news