బీజేపీ దూకుడుతో కలకలం రేపుతున్న గుర్రంబోడు వివాదం

-

గుర్రంబోడు వివాదం రాజకీయంగా కలకలం రేపుతోంది. తమ పార్టీ జిల్లా అధ్యక్షుడిని రాత్రికి రాత్రే నిర్బంధించారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఆరోపణలు..స్థానికి బీజేపీ నేతల పై పోలీసుల కేసులతో గుర్రంబోడు భూ వివాదం కొత్త మలుపు తిరుగుతుంది. టీఆర్ఎస్ బీజేపీ మధ్య నడుస్తున్న ఈ వివాదంలో కాంగ్రెస్ కూడా ఎంటరవ్వడంతో భూ వివాదంపై పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామ రెవెన్యూ పరిధిలో గుర్రంబోడు తండా ఉంది. ఇందులోని సర్వే నెంబరు 540లో వివాదాస్పద భూముల్ని కొందరు సొంతం చేసుకున్నారని.. ప్రైవేటు నిర్మాణం జోరుగా సాగటంపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని సందర్శిచేందుకు వచ్చారు బండి సంజయ్. దీంతో ఈ భూముల వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది.

బండి సంజయ్.. ఎమ్మెల్యే రఘునందన్.. రాజాసింగ్ లతో పాటు పార్టీ నాయకురాలు విజయశాంతి బస్సులో గుర్రంబోడుకు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశ మందిరానికి వెల్లటానికి కాస్త ముందు.. ఒక ప్రైవేటు కంపెనీ నిర్మించిన షెడ్డు వద్ద ఆగారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న స్థానికులు.. బండి సంజయ్ అక్కడకు చేరుకున్న వెంటనే.. ప్రైవేటు నిర్మాణం వద్దకు పరుగులు తీశారు. పెడ్డుపైకి రాళ్లు రువ్వారు. కర్రలతో ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల లాఠిచార్జ్ తో ఇరు వర్గాల మధ్య పరిస్థితి రణరంగంలా మారింది.

టీఆర్ఎస్ నేత రవీంద్రారెడ్డికి లోకల్‌ పోలీసోళ్లు సైతం ఎందుకు వత్తాసు పలుకుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్థానిక గిరిజనులను కిరాయి రౌడీలతో బెదిరించి, రవీంద్రరెడ్డి కబ్జా పర్వం చేస్తుంటే.. లోకల్ పోలీసులు సైతం తప్పుడు కేసులను గిరిజనులపై పెట్టి, జైలుపాలు చేశారని బీజేపీ కాంగ్రెస్ నేతలు ఫైరవుతున్నారు.మరోవైపు ఆరోపణలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని నేతలు సవాళ్లు విసురుతున్నారు.

ఇక బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుర్రపుబోడు దగ్గర పోలీసులు పూర్తిసంయమనం పాటించి, విధులు నిర్వర్తిస్తే… అనుచరులతో వెళ్లి సంజయ్ రెచ్చగొట్టారని మండిపడ్డారు. ఇందులో పోలీసులకు సైతం గాయాలయ్యాలని గుర్తు చేశారు. ఈ అంశాలపై హుజూర్ నగర్, గుర్రంబోడు సహా ఎక్కడైనా చర్చకు సిద్ధమని గులాబీ నేతలు సవాల్ విసురుతున్నారు. గిరిజనానికి బాసటగా తామున్నామంటే, తామున్నామని పార్టీలు చెప్పుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news