తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా నారా లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు..100 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా..కుప్పం టూ ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది.
అయితే ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లని టీడీపీ యువనేతలు చూసుకుంటున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం పాదయాత్ర చేసేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారు. టీడీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళుతున్న లోకేష్ పాదయాత్రకు తాజాగా ‘యువగళం’ అని పేరు పెట్టారు. ఈ పేరు బట్టే అర్ధమైపోతుంది. టీడీపీ టార్గెట్ ఏంటి అనేది..లోకేష్ పూర్తిగా యువతని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తారని తెలుస్తోంది. ఈ పాదయాత్ర ద్వారా కొన్ని టార్గెట్లు సాధించాలని చూస్తున్నారు.
మొదట తెలుగుదేశం పార్టీకి దూరమైన యువ ఓటర్లని దగ్గర చేయాలని చూస్తున్నారు. ఏపీలో యువత వైసీపీ, జనసేనలకు ఎక్కువ మద్ధతు ఇస్తున్నారు. దీంతో వారి మద్ధతు టీడీపీకి పెంచేలా లోకేష్ పాదయాత్ర ఉండనుంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ విధానాలని ప్రజలకు వివరిస్తూ..టీడీపీకి ప్రజా మద్ధతు పెంచి..అధికారంలోకి తీసుకురావడం.
ఇక మెయిన్‌గా లోకేష్..ఒక పరిపూర్ణ నాయకుడుగా ఎదగడం. గత ఎన్నికల ముందు ఆయన్ని పప్పు అని ప్రత్యర్ధులు విమర్శించిన విషయం తెలిసిందే. ఇక ఆ ముద్ర తొలగించుకునేలా ఇప్పుడు పనిచేస్తూ వచ్చారు. ఈ పాదయాత్రతో..భవిష్యత్‌లో టీడీపీని నడిపించే బాధ్యత తనకు దక్కే అర్హత ఉందనేలా లోకేష్ ఎదగడానికి పాదయాత్రని ఉపయోగించుకొనున్నారు.
ఎందుకంటే చంద్రబాబుకు వయసు మీద పడటంతో..టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలనే డిమాండ్ వస్తుంది. లోకేష్‌కు పార్టీని నడిపించే సత్తా లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాదయాత్ర ద్వారా..తనకు పార్టీని నడిపించే సత్తా ఉందని నిరుపుంచుకోవాలని చూస్తున్నారు. మరి చూడాలి లోకేష్..యువగళం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో.