పవన్‌కు లక్కీ ఛాన్స్…డబుల్ డిజిట్ ఫిక్స్?

-

మళ్ళీ మోదీని కలవడం చంద్రబాబుకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలియదు గాని..మోదీ-బాబు కలవడం వల్ల పవన్ బాగా హ్యాపీగా ఫీల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే టీడీపీతో కలవాలని పవన్ అనుకుంటున్నారు…కానీ తమ మిత్రపక్షమైన బీజేపీకి మాత్రం..టీడీపీతో కలవడం ఇష్టం లేదు. గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ చంద్రబాబుతో కలిసే ప్రసక్తి లేదని బీజేపీ నేతలు తేల్చి చెప్పేశారు. దీంతో టీడీపీ-బీజేపీల కలిసే అవకాశం లేదని అంతా అనుకున్నారు.

కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు..ఇప్పటివరకు పరోక్షంగా జగన్ కు మద్ధతు వస్తున్న బీజేపీ..ఇప్పుడు బాబు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కొన్ని సీట్లు గెలవాలంటే సింగిల్ గానో..లేక జనసేన పొత్తు వల్ల సాధ్యం కాదని అర్ధమైంది..అదే బీజేపీతో కలిస్తే నాలుగైదు సీట్లు గెలుచుకోవచ్చు అనేది బీజేపీ కాన్సెప్ట్ గా ఉంది..అందుకే ఎప్పుడు బాబుని విమర్శించే సోము వీర్రాజు వైఖరిలో మార్పు వచ్చింది. బాబుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఢిల్లీలోని పెద్దలు బాబుని కలవడానికి ఆసక్తిగానే ఉన్నారని తాజాగా…మోదీ-బాబు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని..కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకోవడం బట్టి అర్ధమైంది.

ఇక కేంద్రం సపోర్ట్ దొరికితే ఎన్నికల్లో సత్తా చాటవచ్చు అనేది బాబు ప్లాన్. అందుకు తగ్గట్టుగానే బీజేపీ మద్ధతు దొరికేలా ఉంది..ఇలా బాబుకు బీజేపీ దగ్గరవ్వడం పవన్ కు కలిసొస్తుంది…ఆయన ఎలాగో బాబుతో దోస్తీ చేయాలని చూస్తున్నారు. కానీ బీజేపీ సహకరించకపోవడం వల్ల వెనుకడుగు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు సీన్ మారడంతో పవన్ కూడా బాగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో ఈ సారి ఎన్నికల్లో టీడీపీతో గాని పొత్తు ఉంటే…కనీసం 20 పైనే సీట్లు గెలుచుకోవాలనేది పవన్ కాన్సెప్ట్ గా ఉంది. సింగిల్ గా పోటీ చేసిన, బీజేపీ తో కలిసి పోటీ చేసిన జనసేన సింగిల్ డిజిట్ కే పరిమితం కావాలి..అదే టీడీపీతో పొత్తు ఉంటే డబుల్ డిజిట్ సీట్లు గెలుచుకోవచ్చు. మొత్తానికి బాబు-బీజేపీ కలవడం పవన్ కు లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news