కారుకు గాలిపటం దెబ్బ..ఆ స్థానాల్లో చిక్కులేనా?

-

తెలంగాణ రాజకీయాల్లో ఎం‌ఐ‌ఎం పాత్ర ఏంటి? ఆ పార్టీ ఎక్కడవరకు పరిమితం అనేది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రాని..కానీ పాతబస్తీలోని 7 స్థానాలు మాత్రం ఎం‌ఐ‌ఎం ఖాతాలో పడాల్సిందే. రాష్ట్రంలో ఏ పార్టీ గాలి ఉన్నా సరే పాతబస్తీలో ఎం‌ఐ‌ఎం హవా నడవాల్సిందే. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉంటే ఎం‌ఐ‌ఎం 7 స్థానాలు తీసేసి..మిగిలిన స్థానాల్లోనే మిగతా పార్టీ పార్టీలు రాజకీయం చేయాలి.

అంటే ఆ 7 స్థానాలు ఇంకా ఎం‌ఐ‌ఎం పార్టీకే రిజర్వ్ అనే పరిస్తితి. పాతబస్తీ ప్రజలు ఎం‌ఐ‌ఎం వైపు తప్ప వేరే పార్టీ వైపు చూడటం కష్టమనే పరిస్తితి. ఇలా 7 స్థానాలని దక్కించుకుంటున్న ఎం‌ఐ‌ఎం గత రెండు ఎన్నికల్లోనూ పరోక్షంగా బి‌ఆర్‌ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తూనే ఉంది. రెండుసార్లు బి‌ఆర్ఎస్ ప్రభుత్వానికి మద్ధతు ఇస్తూనే వస్తున్నారు. కానీ తాజాగా అసెంబ్లీలో మంత్రి కేటీఆర్, ఎం‌ఐ‌ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీల మధ్య జరిగిన మాటల యుద్ధం బట్టి చూస్తే..ఈ సారి ఎం‌ఐ‌ఎం..బి‌ఆర్‌ఎస్ పార్టీకి డ్యామేజ్ చేసేలా ఉంది.

TRS-MIM secret pact worries Muslim leaders from Old City

అసలు సంఖ్యా బలం తక్కువ ఉన్న ఎం‌ఐ‌ఎం పార్టీకి అసెంబ్లీలో ఎక్కువ సేపు మాట్లాడటానికి సమయం ఎందుకు ఇవ్వాలని అన్నట్లు కే‌టి‌ఆర్ మాట్లాడారు. దీనిపై అక్బరుద్దీన్ ఫైర్ అయ్యారు..వారిని పొగిడితే ఎక్కువ సమయం ఇస్తారని, లేదంటే మైక్ కట్ చేస్తారని అన్నారు. ఇక తక్కువ స్థానాలు అంటున్నారు కదా..ఈ సారి 50 స్థానాల్లో పోటీ చేయాలని మా అధినేతకు చెబుతామని, కనీసం 15 స్థానాలని గెలుచుకుని అసెంబ్లీలో అడుగుపెడతామని అక్బరుద్దీన్..కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

ఈ సవాల్ ఏమో గాని నిజంగానే ఎం‌ఐ‌ఎం గాని 50 స్థానాల్లో పోటీ చేస్తే బి‌ఆర్‌ఎస్‌కే డ్యామేజ్. ఎందుకంటే ఇంతకాలం ముస్లిం ఓట్లు కాస్త ఎక్కువ ఉన్న స్థానాల్లో పోటీ చేయకుండా పరోక్షంగా బి‌ఆర్‌ఎస్ మద్ధతు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థానాల్లో ఎం‌ఐ‌ఎం బరిలో దిగితే ఓట్లు చీలి బి‌ఆర్‌ఎస్‌కు డ్యామేజ్ తప్పదు. మరి ఈ సారి ఎం‌ఐ‌ఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news