యాభై కోట్ల మందికి మోడి ఏర్పాట్లు … అంటే కనీసం యాభై లక్షల మందికి ఎఫెక్ట్ ?

-

దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించి దేశ ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో త్వరలో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అన్నీ కూడా బయట పడే విధంగా ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పూర్తి మేటర్ లోకి వెళ్తే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ పరిధిలో కరోనా వైరస్ చికిత్స పరీక్షలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా వైరస్ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసినదే.Coronavirus: PM Modi praises India's discipline during, asks ...అయితే తాజాగా మోడీ తీసుకున్న నిర్ణయంతో యాభై కోట్ల మంది ఉచితంగా కరోనా పరీక్షలు చేయించుకొనే అవకాశం ఉంటుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని దీనిలో ఏకం చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా దేశంలోని ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్ లు మాత్రమే కరోనా పరీక్షలను చేయాలని నిర్ణయించాడు. దీంతో దేశంలో అన్ని ప్రైవేటు ల్యాబ్స్ కరోనా వైరస్ పరీక్షలు చేయడానికి అనుమతులు ఇవ్వలేదు.

 

దీంతో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ల్యాబ్ లను ఆసుపత్రులను కరోనా వైరస్ హాస్పిటల్స్ గా మార్చే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది. దేశంలో రానురాను కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 50 కోట్ల మందికి మోడీ ఏర్పాటు చేసిన ఈ సరికొత్త స్కీం వల్ల కనీసం యాభై లక్షల మందికి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని…ఈ సందర్భంగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించే ఆయా ప్రైవేట్ ల్యాబ్ సిబ్బందికి సరైన భద్రత ఇచ్చే కిట్ ఇవ్వాలని దేశంలో కొంతమంది వైద్యులు కోరుతున్నారు. లేకపోతే వారి వల్ల ఇతరులకు సోకే అవకాశం ఉందని అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news