కరోనా వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఏర్పడటం మనకందరికీ తెలిసినదే. పేద మరియు మధ్యతరగతి ప్రజలు లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు చేసుకోలేక ఇంటిలో కుటుంబాలను పోషించుకోవడం కోసం చేయి చాచే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వలస కార్మికులు దాదాపు దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది ఎక్కడెక్కడో ఇరుక్కుపోయారు. ఇటువంటి తరుణంలో మూడవ దశ లాక్ డౌన్ కేంద్రం పొడిగించడం జరిగింది.మరొక పక్క వలస కార్మికులకు ఊరట నిచ్చింది. ఏ రాష్ట్రాలలో వలస కార్మికులు ఇరుక్కుని పోయారో వారిని సొంత స్థలాలకు వెళ్లవచ్చని దేశవ్యాప్తంగా రైళ్లను నడపటానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఈ విషయంలో రైల్వే శాఖ వలస కార్మికులు చెల్లించాల్సిన టికెట్ ఖరీదు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలంటూ మెలిక పెట్టడం జరిగింది. ఇదే సమయంలో స్పెషల్ ట్రైన్స్ కాబట్టి అదనపు చార్జీలు కూడా చెల్లించాలని రైల్వేశాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.
లాక్ డౌన్ వల్ల ఆదాయం లేక ఖాళీ ఖజానాలు దర్శనం ఇస్తుంటే ఈ విధంగా రైల్వే శాఖ వ్యవహరించడం దారుణమని అంటున్నారు. మోడీకి సరైన ప్లానింగ్ లేక వలస కూలీల విషయంలో ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటే దానికి మేమెందుకు బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. లాక్ డౌన్ అమలు చేయడంలో మోడీ సర్కార్ విఫలమైందని చాలా రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.