మోడీ అసలు ఉద్దేశ్యం ఏంటి ? ఇదేనా ప్లాన్ ?

-

కరోనా వైరస్ లాక్ డౌన్ విషయంలో సస్పెన్స్ కి తెరపడింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగిస్తారా లేదా అన్న దాని విషయంలో ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చేశారు. దేశంలో ఉన్న కొద్ది వైరస్ బలపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముందు నుండి దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పొడిగించాలని అంటూనే ఉన్నారు. ఈ టైంలో కేంద్రం ముఖ్యమంత్రులు, వైద్యులు, ఇంకా మేధావుల నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవటం జరిగింది. దీంతో అందరి సూచనల మేరకు ప్రధాని మోడీ మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.PM Modi changes Twitter profile photo to send message amid ... ఈ సందర్భంగా మంగళవారం ఉదయం జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించిన విషయం అందరికీ తెలిసినదే. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ దేశ ప్రజలను ఉద్దేశించి కరోనా వైరస్ తో జరుగుతున్న యుద్ధంలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారత్ ముందు ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు సహకరించబట్టే కరోనా వైరస్ ని కట్టడి చేయగలిగారు అని దేశ ప్రజలందరినీ అభినందించారు. ఉన్నకొద్దీ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న ఈ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ అమలులో ఉన్న టైంలో ప్రజలు ఏ విధమైన కష్టాలు పడ్డారో అర్థం చేసుకోగ‌ల‌న‌ని మోడీ చెప్పుకొచ్చారు.

 

దీంతో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయానికి చాలా వరకు దేశవ్యాప్తంగా సానుకూలం వ్యక్తమవుతోంది. ఇదే టైములో మధ్యలో ఏప్రిల్ 20 వరకు కఠినంగా ఉంటుందని, ఆ తర్వాత నిబంధనలు సడలించే అవకాశముందని సరికొత్త ప్లాన్ చెప్పడం తో  అందరూ షాక్ తిన్నారు. దీంతో అసలు మోడీ ఉద్దేశం ఏమిటి అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. మే 3 వరకు పొడిగింపు అని మళ్లీ మధ్యలో ఏప్రిల్ 20 తర్వాత సడలింపులు చేస్తామని చెప్పడానికి కేంద్రం యొక్క ఉద్దేశం ఏమిటి అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఇటువంటి తరుణంలో మేధావులు ఏప్రిల్ 20 లోగా కాస్త కంట్రోల్ అయితే హాట్ స్పాట్ లు ఎంపిక చేసి అక్కడ రెడ్ జోన్ లు పెట్టి గట్టిగా పాటించేలా చేస్తారు. ఒకవేళ కంట్రోల్ అవకపోతే మే 3 వరకూ చూస్తారు, అప్పటికీ కంట్రోల్ అవకపోతే ఇంకా పొడిగింపు కార్యక్రమాలు అనగా మూడవ దశ లాక్‌డౌన్ ఉండొచ్చని అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news