మమతా బెనర్జీ. ఆమె ఓ నియంత. పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టులనే తరిమికొట్టిన చరిత్ర ఆమెది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ.. తాజాగా మళ్లీ వార్తల్లోకెక్కారు. ప్రస్తుతం ఆమె కోల్ కతాలో దీక్ష చేపట్టారు. అది కూడా కేంద్ర ప్రభుత్వంపై. కేంద్ర ప్రభుత్వ ధోరణిని ఎప్పటికప్పుడు ఎండగట్టే వ్యక్తుల్లో మమతా ముందుంటారు. ఆమె ఎవరికీ భయపడరు. బెదరరు. అందుకే.. ఆమెను చూస్తే మిగితా నాయకులు కూడా భయపడాల్సిందే. ప్రధాని మోదీ కూడా ఇందుకు మినహాయింపు కాదనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.
కేంద్రం ఒంటెద్దు పోకడలను భరించలేక.. సీబీఐని కీలుబొమ్మలా మార్చి.. దాన్ని తమ ఇష్టానుసారం వాడుకుంటూ ఫెడరల్ వ్యవస్థనే కేంద్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోందని ఆమె కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఈనేపథ్యంలో గత రాత్రి నుంచి ఆమె నడిరోడ్డుపైనే దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును కోల్ కతా నడి రోడ్డు మీద ఆమె ఎండగడుతున్నారు.