సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వచ్చిన సినిమా పేట. తెలుగు, తమిళ భాషల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా మళ్లీ నిరాశపరచింది. తమిళంలో యావరేజ్ అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది. వల్లభనేని అశోక్ ఈ సినిమాను తెలుగులో 21 కోట్లకు కొన్నారు. పేట ఫుల్ రన్ లో 6 కోట్ల రూపాయలను మాత్రమే కలెక్ట్ చేసింది.
గత కొంతకాలంగా రజిని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావితం చూపించడం లేదు. తెలుగులో మన స్టార్ హీరోలకు ధీటుగా వసూళ్లు రాబట్టుకునే రజిని సినిమాలు వరుసగా లాసులు తెస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన 2.ఓ సినిమా కూడా దిల్ రాజు, యువి క్రియేషన్స్, ఎన్వి ప్రసాద్ లకు నష్టాలను తెచ్చిపెట్టింది. ఇక రజిని సినిమాలను తెలుగులో రిలీజ్ చేయాలనే సాహసం చేయట్లేదు తెలుగు డిస్ట్రిబ్యూటర్స్.
పేట తమిళంలో పర్వాలేదు అనిపించుకుంది ఓవర్సీస్ లో రజిని ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. అయితే అంత హంగామా చేసినా తమిళనాడులో కూడా ఇంకా బ్రేక్ ఈవెన్ కు చేరుకోలేదని తెలుస్తుంది. ప్రస్తుతం రజిని మురుగదాస్ డైరక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.