షర్మిలకు మోదీ ఫోన్..టీడీపీ సృష్టే..!

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో షర్మిల అంశం ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఆమె టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, మంత్రులని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేయడం. దానికి బదులుగా ఇటీవల నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు..షర్మిల పాదయాత్రపై రాళ్ళ దాడి చేయడం..ఆ తర్వాత హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు..షర్మిల కారులో ఉండగానే..ఆ కారుని క్రేన్‌కు కట్టుకుని తీసుకెళ్ళడం, ఆమెని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్ పై రావడం జరిగాయి.

అయితే షర్మిల అంశంపై తెలంగాణలోని బీజేపీ నేతలు..టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో షర్మిల బీజేపీ వదిలిన బాణం అని చెప్పి టీఆర్ఎస్ విమర్శలు చేసింది. కానీ షర్మిలకు సపోర్ట్ గా ఏపీలో ఉన్న తన అన్న జగన్ గాని, ఆయన పార్టీ వాళ్ళు స్పందించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే..ఆ ఘటన బాధాకరమని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా జీ-20 సదస్సులో భాగంగా ఢిల్లీకి వెళ్ళిన జగన్‌ని..మోదీ ప్రశ్నించారని టీడీపీ మీడియా కథనం వేసింది.

షర్మిల పై దాడి జరిగిన స్పందించలేదు ఎందుకని జగన్‌ని మోదీ ప్రశ్నించినట్లు కథనం ఇచ్చారు. మరి ఈ కథనంలో ఎంతవరకు వాస్తవం  ఉందో ఎవరికి క్లారిటీ లేదు. ఇదిలా నడుస్తుండగానే తాజాగా షర్మిలకు మోదీ ఫోన్ చేసి పరామర్శించారని, ఓ 10 నిమిషాల పాటు మాట్లాడి..ఢిల్లీకి రావాలని సూచించారని అన్నీ మీడియా వెబ్‌సైట్లలో వార్త వచ్చింది. ఇక ఇది వాస్తవమే అని అంటున్నారు. ఇదిలా ఉంటే షర్మిల విషయంలో జగన్‌ని మోదీ ప్రశ్నించారని టీడీపీ అనుకూల మీడియా కథనం ఇవ్వడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.

“ అరే…! అసలక్కడ మూడో వ్యక్తే లేరు. పచ్చ కుల మీడియా గాలి పోగేసి వార్తలు రాస్తోందని చెప్పేందుకు ఇదో మచ్చుతునక. తెలుగు ప్రజలకు పట్టిన ఈ దరిద్రం 2024తో వదిలిపోతుంది.” అని టీడీపీ మీడియా వేసిన కథనాన్ని జోడిస్తూ ట్వీట్ వేశారు. అంటే ఇదంతా టీడీపీ సృష్టించిందే అన్నట్లు చెప్పుకొచ్చారు. మరి షర్మిలకు మోదీ ఫోన్ చేశారనేది నిజమో కాదో..