విజయవాడ నుంచి టీడీపీ తరుపున ఎంపీగా గెలిచిన కేశినేని నాని.. తమ అధినేతపై కూడా పోస్టులు పెట్టారు. తనను చంద్రబాబు.. లోక్ సభలో విప్ పదవికి ఎంపిక చేసినా కూడా దాన్ని నాని సున్నితంగా తిరస్కరించారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు. ఓ వైపు జగన్ ను అభినందిస్తూనే మరో వైపు విమర్శించారు. అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్ ను అభివృద్ధి చేద్దాం అన్న తరహాలో జగన్ పాలన ఉన్నట్టుగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
మీకు దేవుడిచ్చిన స్నేహితుడు కేసీఆర్ తో కలిసి మీరు తెలంగాణ, ఆంధ్రా మధ్య ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. బాగుంది. కానీ.. ఇక్కడ ప్రశ్న ఏంటంటే… మీరు సమస్యలను తెలంగాణకు అనుకూలంగా పరిష్కరిస్తున్నారా? లేక అనాథగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ సమస్యలను పరిష్కరిస్తున్నారా? ఆంధ్రా ప్రజలు కొంచెం వివరంగా చెప్పరూ.. అంటూ నాని.. జగన్ పై మరో పోస్ట్ పెట్టారు.
విజయవాడ నుంచి టీడీపీ తరుపున ఎంపీగా గెలిచిన కేశినేని నాని.. తమ అధినేతపై కూడా పోస్టులు పెట్టారు. తనను చంద్రబాబు.. లోక్ సభలో విప్ పదవికి ఎంపిక చేసినా కూడా దాన్ని నాని సున్నితంగా తిరస్కరించారు.