గ‌జ‌ప‌తిని వ‌ద‌ల‌నంటున్న ఎంపీ.. అస‌లు కార‌ణం ఇదే!

ఏపీ రాజ‌కీయాలు తెలంగాణ కంటే భిన్నంగా ఉంటాయి. అక్క‌డ ప్ర‌తి అంశం రాజ‌కీయంగా ప్రాముఖ్య‌త సంత‌రించుకున్నదే అవుతుంది. ఇక కుల వ‌ర్గాల ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌ధానంగా ఆంధ్రా రాజ‌కీయాలను కేవ‌లం నాలుగు కులాలు మాత్ర‌మే శాసిస్తున్నాయి. క‌మ్మ‌, కాపు, రెడ్డి, క్ష‌త్రియ కులాల ఆధీనంలోనే ఆంధ్రా రాజ‌కీయాలు ఆధార‌ప‌డి ఉంటాయి.

ఇక ఇప్పుడు క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం వైసీపీ గుర్రుగా ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ ఎంపీ అయిన విజ‌య‌సాయి రెడ్డి గ‌జ‌ప‌తి రాజుపై చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా కూడా మ‌రోసారి విజ‌య‌సాయి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హిళ‌ల‌కు ఆస్తి హ‌క్కు లేద‌న్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ్యాఖ్య‌లపై కౌంట‌ర్లు వేశ‌రు.

అలాగే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే వీటి వెన‌క ఓ కార‌ణం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ర‌ఘురామ రాజు వ్య‌వ‌హారంతో కాక‌మీదున్న వైసీపీ ఆయ‌న‌కు అండ‌గా వారి సామాజిక వ‌ర్గం రాకుండా చూడాల‌ని భావిస్తోంది. అలాగే వారి సామాజిక వ‌ర్గం మ‌ధ్య ఐక్య‌త లేకుండా చేయాల‌ని చూస్తున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందుకోస‌మే వైసీపీకి చెందిన క్ష‌త్రియ మంత్రి, ఎమ్మెల్యేల‌తో కౌంట‌ర్లు వేయిస్తున్నారు. మ‌రి విజ‌య‌సాయి ప్లాన్ ఏ మేర‌కు వ‌ర్కౌట్ అవుతుందో తెలియాలంటే వేచిచూడాలి.