మునుగోడు మినీ వార్: కమ్యూనిస్టులపై కన్ను..?

మునుగోడు ఉపఎన్నిక చాలా హాట్ హాట్ గా సాగేలా ఉంది..ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే మునుగోడు ఉపఎన్నిక ఒక ఎత్త్ఊ కానుంది…ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మునుగోడు ఉపఎన్నిక జరుగుతుంది. ఈ ఉపఎన్నికల్లో సత్తా చాటితేనే…సాధారణ ఎన్నికల్లో కూడా సత్తా చాటగలమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే మూడు ప్రధాన పార్టీలు మునుగోడు ఉపఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఈ ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి చావో రేవో లాంటిది…ఇందులో గెలిస్తేనే…అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటగలమనే నమ్మకం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంటుంది…ఇక ఈ ఉపఎన్నికలో గెలిచి…అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది. ఇటు మునుగోడు కాంగ్రెస్ సిటింగ్ స్థానం..సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోతే కాంగ్రెస్ పరిస్తితి మరీ ఘోరంగా ఉంటుంది..అందుకే సిట్టింగ్ స్థానంలో సత్తా చాటి…తమ సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది.

అయితే ఇక్కడ గెలవడానికి ఎవరి వ్యూహం వారికి ఉంది..కానీ ఇందులో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ ఒకే వ్యూహంతో ముందుకెళుతున్నాయి. అది ఏంటంటే..ఇక్కడ మంచి బలం ఉన్న కమ్యూనిస్టుల మద్ధతు పొందాలని రెండు పార్టీలు ట్రై చేస్తున్నాయి. ఎలాగో కమ్యూనిస్టులు బీజేపీ వైపుకు వెళ్లరు.. సింగిల్ గా పోటీ చేస్తే గెలిచే సత్తా లేదు…కానీ కమ్యూనిస్టులకు గెలుపోటములని మార్చే బలం కాస్త ఉంది. 1967 నుంచి 2019 వరకు చూసుకుంటే…మునుగోడులో కాంగ్రెస్ ఆరు సార్లు గెలవగా, సి‌పి‌ఐ అయిదుసార్లు గెలిచింది. ఒకసారి టీఆర్ఎస్ గెలిచింది.

అయితే ఇక్కడ సి‌పి‌ఐ చివరిగా గెలిచింది…2009లో అప్పుడు…టీడీపీ-టీఆర్ఎస్ తో సి‌పి‌ఐకి పొత్తు ఉంది. మధ్యలో కొన్నిసార్లు టీడీపీతో పొత్తులో గెలిచింది. కానీ మునుగోడులో కమ్యూనిస్టు పార్టీని అభిమానించే వారు ఇంకా ఉన్నారు. అందుకే వారిని దగ్గర చేసుకోవాలని అటు కేసీఆర్, ఇటు రేవంత్ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్…కమ్యూనిస్టు నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటు తాజాగా మునుగోడులో సభ పెట్టిన రేవంత్..కమ్యూనిస్టు సోదరులు కలిసిరావాలని, కాంగ్రెస్, కమ్యూనిస్టు కోటని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తానికి కమ్యూనిస్టులని కలుపుకునేందుకు కారు, కాంగ్రెస్ పార్టీలు బాగానే ట్రై చేస్తున్నాయి. మరి కమ్యూనిస్టులు ఎవరికి సపోర్ట్ ఇస్తారో చూడాలి.