మునుగోడు బట్టే ఆ సీనియర్ల రాజకీయం..!

-

టీఆర్ఎస్‌లో ఉన్నారు…కానీ ఆ పార్టీలో పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. పోనీ పార్టీ మారతారా? అంటే అది జరగడం లేదు. అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలు టీఆర్ఎస్ పార్టీలో బాగా టెన్షన్ లేపుతున్నారు. వారు ఎప్పుడు కారుకు షాక్ ఇస్తారో అర్ధం కాకుండా ఉంది. ఒకవేళ ఆ ఇద్దరు నేతలకు కీలక పదవులైన దక్కి ఉంటే పరిస్తితులు వేరేగా ఉండేవి…కానీ కేసీఆర్…వారికి ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో వారు చాలా రోజుల నుంచి అసంతృప్తిగా ఉన్నారు.

ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తుంది. అసలే ఉమ్మడి ఖమ్మంలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. ఇప్పుడు బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు సీనియర్లపై గేలం వేసినట్లు తెలుస్తోంది. వారు కూడా పరిస్తితులని చూసుకుని కారు దిగి, బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతూనే వస్తుంది. ఇప్పటివరకు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఈపాటికే అందరికీ అర్ధమయ్యి ఉండాలి.

చాలా కాలం నుంచి సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరు టీఆర్ఎస్ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతూనే ఉంది. 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చేరిన వీరికి…అప్పుడు ప్రాధాన్యత బాగానే దక్కింది. కానీ 2018 ఎన్నికల్లో ఇటు తుమ్మల పాలేరులో ఓడిపోయారు. అటు పొంగులేటికి సీటు కూడా దక్కలేదు.

అయితే ఏదొక పదవి దక్కుతుందని ఇద్దరు నేతలు ఎదురుచూశారు. కానీ ఇంతవరకు ఏ పదవి దక్కలేదు. పైగా నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కుతుందనే గ్యారెంటీ లేదు. దీంతో వీరు టీఆర్ఎస్ లో మరీ యాక్టివ్ గా పనిచేయడం లేదు. తుమ్మల అయిన పర్లేదు గాని…పొంగులేటి అయితే టీఆర్ఎస్ పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిణామాలని గమనిస్తుంటే…త్వరలోనే వీరు కారుని షేక్ చేసే వార్త ఒకటి చెబుతారని తెలుస్తోంది. కాకపోతే మునుగోడు ఉపఎన్నిక బట్టే వీరు స్టెప్ ఉంటుందని తెలుస్తోంది. ఆ ఎన్నికలో బీజేపీ గెలిస్తే…ఖచ్చితంగా వీరు కారు దిగేసేలా ఉన్నారు. చూడాలి మరి ఈ సీనియర్లు రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news