జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కానున్న నాగార్జున‌, చిరంజీవి..?

-

ప్ర‌ముఖ సినీ న‌టుడు నాగార్జున వైఎస్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రవుతారని తెలుస్తుండ‌గా, మ‌రో ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి కూడా ఆ కార్యక్ర‌మానికి వెళ్తార‌ని స‌మాచారం.

 

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యం సాధించి సీఎంగా ఎన్నికైన జ‌గ‌న్ రేపు విజ‌య‌వాడ‌లో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ఇప్ప‌టికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు ప్ర‌ధాని మోడీల‌కు త‌న ప్ర‌మాణ స్వీకారానికి రావాల‌ని ఆహ్వానాల‌ను పంపారు. అలాగే ఏపీ ప్రతిప‌క్ష నేత చంద్ర‌బాబుకు కూడా జ‌గ‌న్ ఫోన్ చేసి త‌న ప్ర‌మాణ స్వీకారానికి రావ‌ల్సిందిగా కోరారు. అయితే వీరే కాకుండా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కానున్నార‌ని తెలిసింది.

ప్ర‌ముఖ సినీ న‌టుడు నాగార్జున వైఎస్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రవుతారని తెలుస్తుండ‌గా, మ‌రో ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి కూడా ఆ కార్యక్ర‌మానికి వెళ్తార‌ని స‌మాచారం. జ‌గ‌న్‌కు, నాగార్జున‌కు ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. వారిద్ద‌రూ మంచి మిత్రులే కాదు, ఇద్ద‌రూ ప‌లు వ్యాపారాల్లోనూ భాగస్వాములుగా ఉన్నారు. అలాగే ఎన్నిక‌ల‌కు ముందు నాగార్జున జ‌గ‌న్‌ను క‌ల‌సి త‌న మ‌ద్ద‌తు ఆయ‌న‌కు ప్ర‌క‌టించారు. దీంతో నాగార్జున క‌చ్చితంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రవుతార‌ని తెలుస్తోంది.

ఇక ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన మంచు ఫ్యామిలీతోపాటు పోసాని కృష్ణ‌ముర‌ళి, పృథ్వీ, ఆలీ.. త‌దిత‌ర ప్ర‌ముఖ సినీ న‌టులు కూడా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి వెళ్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఈ క్ర‌మంలోనే వైసీపీ నుంచి వారంద‌రికీ ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందాయ‌ని తెలిసింది. మ‌రి రేపు జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి ఎవ‌రెవ‌రు హాజ‌ర‌వుతారో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news