బ్రేకింగ్‌ : నారా లోకేష్‌ అరెస్ట్‌

తెలుగు దేశం యువ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కాసేపటి క్రితమే అరెస్ట్‌ అయ్యారు. ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు టీడీపీ నేత నారా లోకేష్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సరావు పేట లో హత్య కు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్‌ నుంచి ఇవాళ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ నేపథ్యం లో తెలుగు దేశం పార్టీ నాయకులు వేలాది సంఖ్య లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే… నారా లోకేష్‌ ను నర్సారావు పేట వెళ్లేందుకు అనుమతి లేదంటూ విమానశ్రయం వద్దనే పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అనంతరం మంత్రి కొడాలి నాని నియోజక వర్గంమైన గుడివాడ నందివాడ పోలీస్‌ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇక అటు ఎంపీ రామ్మోహన్ నాయుడు , మాజీ ఎమ్మెల్యే కూనరవికుమార్ కు అరెస్టు అయ్యారు.