గంటా కోసం లోకేష్‌ తిప్ప‌లు చూశారా..!

-

తెలుగుదేశం పార్టీని వీడటానికి గాను ఆ పార్టీలోని నమ్మకస్తులైన నేతలు కూడా సిద్దపడుతున్నారు అనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి తీసుకుని చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చిన కొందరు వ్యాపారవేత్తలు పార్టీ మారేందుకు ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు. ఎలాగోలా కష్టపడి గెలిచిన వాళ్ళు కూడా పార్టీ మారడానికి సిద్దపడటం అధినేతతో పాటు కార్యకర్తలకు కూడా ఇబ్బందికరంగానే ఉందని అంటున్నారు.

ఇందులో ప్రధానంగా చర్చించాల్సిన పేరు… గంటా శ్రీనివాసరావు… వ్యాపారాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చే గంటా… తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం కి ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ కి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు తెలుగుదేశం నుంచి బిజెపికో లేదా వైసీపీలోకో వెళ్ళడానికి సర్వం సిద్దం చేసుకునే పనిలో పడ్డారు. గంటా త‌న‌తో పాటు త‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేల‌తో పాటు కీల‌క నేత‌ల‌ను కూడా తీసుకుని పోతార‌ని అంటున్నారు.

ఇక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుతో ఉన్న విభేదాలు కూడా గంటా పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కారణాలుగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. త్వరలోనే గంటా పార్టీ మారతారని అంటున్నారు. ఈ నేపధ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ రంగంలోకి దిగి గంటాను బుజ్జగించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. గంటా ఇటీవల విజయవాడ రాగా ఆయన్ను బలవంతంగా అయినా కలిసే ప్రయత్నం చేసారు లోకేష్. పార్టీకి ఇబ్బంది లేదని… పార్టీ మారితే మీకే నష్టమని గడ్డం పట్టుకుని మరీ చెప్పే పరిస్థితికి వెళ్లారట. అయినా లోకేష్‌ను గంటా లైట్ తీస్కొన్న‌ట్టు స‌మాచారం.

ఇక అనంతరం చంద్రబాబు కూడా ఫోన్ లో మాట్లాడగా ఏ ఇబ్బంది ఉండదు పార్టీకి అని చెప్పినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో అధికారంలోకి రావడం ఖాయమనే విషయాన్ని గంటాకు వివరించే కార్యక్రమాన్ని చేశారు చంద్రబాబు, చినబాబు. అయితే గంటా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు వద్ద సమాధానం లేదట… మీ సామాజిక వర్గమే మిమ్మల్ని నమ్మడం లేదు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో చంద్ర‌బాబు ఒక్క‌సారిగా అవాక్కైన‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news