కరోనా గోల ఏమోగానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం ఎక్కడా ఆగటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మరియు దేశంలో అన్ని రాష్ట్రాల్లో దాదాపు అధికార ప్రతిపక్ష పార్టీలు కరోనా వైరస్ పై కలిసి పోరాడుతున్నాయి. ఏపీలో మాత్రం దానికి భిన్నంగా పూర్తి వాతావరణం నెలకొంది. ఈ వైరస్ ని అడ్డం పెట్టుకుని టిడిపి వైసిపి పార్టీలు పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు పై సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి. మద్యం నిషేధానికి సరైన సమయం ఇదే అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్లు సూపర్ లాజిక్ లు తీస్తున్నారు.పూర్తి విషయం లో వెళ్తే ఇటీవల ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా మద్యం దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చని అనుమతులు ఇవ్వడం మనకందరికీ తెలిసినదే. దీంతో దాదాపు 40 రోజులకు పైగా గొంతులో మందు చుక్క పడని మందు బాబులు…షాపులు ఓపెన్ అవటంతో భయంకరమైన క్యూ కట్టారు. ఈ పరిణామాలన్నింటినీ ప్రస్తావిస్తూ చంద్రబాబు మద్య నిషేధం అనే మాట రావడంతో నెటిజన్లు దిమ్మతిరిగిపోయే ప్రశ్నలు వేస్తున్నారు. పూర్తి మధ్యపాన నిషేధ రాష్ట్రం గా ఎన్టీఆర్ ఉన్న టైంలో, అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో మళ్లీ మద్యపానాన్ని అమలు చేసింది ఎవరు? ఆడపడుచుల కన్నీటికి కారణం ఎవరు బాబు నువ్వు కాదా అని ప్రశ్నలు వేస్తున్నారు.
2014లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమయంలో మద్యం డోర్ డెలివరీ చేసిన ముఖ్యమంత్రి ఎవరు అంటూ ఇండైరెక్టుగా బాబుపై సెటైర్లు వేస్తున్నారు. మరి ఇలాంటి ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర సమాధానం ఉందో లేదో టిడిపి నాయకులు స్పందించాలి. కేవలం ఏపీ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మద్యం దుకాణాలు తెరిచారు. అంతేకాకుండా మోదీని కరోనా విషయంలో ప్రశసించే చంద్రబాబు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లిక్కర్ సేల్స్ ను ప్రారంభించడాన్ని మాత్రం ఎందుకు తప్పు పట్టలేకపోతున్నారు అని ప్రశ్నిస్తున్నారు.