జిల్లాల్లో ‘జాతర’..వివాదాల్లో ‘పేర్లు’…?

-

ఏపీలో జిల్లాల విభజనపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది…జగన్ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో జిల్లాల విభజన చేసిందో తెలియదు గాని..ఇప్పుడు అదే అంశం వైసీపీ ప్రభుత్వం మెడకు చుట్టుకునేలా ఉంది. ఎందుకంటే జిల్లాల విభజన ఓ రకంగా మంచి విషయమే..పరిపాలన సౌలభ్యం కోసం చేయొచ్చు. కానీ అసంపూర్తిగా జిల్లాల విభజన చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని చెప్పొచ్చు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతుంది..ఇప్పటికే పలు నియోజకవర్గాల ప్రజలు..ఉన్న జిల్లా కంటే తమని వేరే జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉదాహరణకు మచిలీపట్నం పరిధిలోకి వచ్చిన గన్నవరం, పెనమలూరు ప్రజలు…తమని విజయవాడలో కలపాలని కోరుతున్నారు. సరే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో ఉంది. సరే ఇదొక ఇష్యూ అనుకుంటే…జిల్లాల పేర్లు ఇప్పుడు మరొక వివాదం అవుతుంది. పాత 12 జిల్లాల పేర్లని అలాగే కొనసాగించినప్పుడు.. ఒక్క కడప జిల్లాకు మాత్రం వైఎస్సార్ అని పెట్టి వదిలేయడం ఏంటని ఆ జిల్లా ప్రజలు అంటున్నారు. కనీసం వైఎస్సార్ కడప అని పెట్టమని డిమాండ్ చేస్తున్నారు.

ఇక తిరుపతి పార్లమెంట్‌కు బాలాజీ జిల్లా అని పేరు పెట్టారు. నార్త్ ఇండియాలో వాడే బాలాజీ పేరుని…మన రాష్ట్రంలో వాడటం ఏంటని, శ్రీ వేంకటేశ్వర జిల్లా అని పెట్టాలని అంటున్నారు. ఇటు కృష్ణా నది ప్రవహించే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని, ఎన్టీఆర్ పుట్టిన వూరు ఉన్న మచిలీపట్నంకు కృష్ణా జిల్లా అని అలాగే ఉంచేయడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి.

jagan
jagan

అటు కోనసీమగా ఏర్పడిన జిల్లాకు బాలయోగి అని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అరకు పార్లమెంట్‌ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశారు…ఒక జిల్లాకు మన్యం అని, మరొక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. అసలు మన్యం వీరుడు అని అల్లూరిని అంటారు..అలాంటప్పుడు ఇలా రెండు పేర్లు పెట్టడం ఏంటని అంటున్నారు. ఇలా ఎక్కడకక్కడ జిల్లాల పేర్లపై వివాదం నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news