టెక్నాలజీ పెరిగిపోవడంతో పాటుగా బయట ప్రపంచంలో జరుగుతున్న న్యూస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రావడంతో పత్రికా రంగం పూర్తిగా దెబ్బతింది. ఒకానొక సమయంలో 3g, 4g టెక్నాలజీ రాకముందు ప్రభుత్వానికి సంబంధించిన వార్తలన్నీ పత్రికల్లో కనబడేవి. రానురాను ఎలక్ట్రానిక్ మీడియా రావటం, ఆ తర్వాత సోషల్ మీడియా రావడంతో ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది. చాలా వరకు రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత సమాచారాన్ని, అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా లైవ్ లో చెప్పేస్తున్నారు. దీంతో పత్రికా రంగం పూర్తిగా డేంజర్ లో పడింది. చాలావరకు పత్రికలు మూతపడ్డ కి రెడీ అయ్యాయి. ఇటువంటి తరుణంలో ఆయా పత్రికలు తాజాగా జర్నలిజంలో సరికొత్త పరవళ్ళు కి శ్రీకారం చుట్టడానికి కొత్త విప్లవంతో రెడీ అయ్యారు. అదేమిటంటే తమ పత్రికలో ప్రచురితమైన వార్తలను సదరు పత్రిక ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియా ద్వారా అనగా ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా గ్రూపులలో షేర్ చేయటానికి రెడీ అయ్యారు.
ఈ విధంగా తమ పత్రిక సంస్థలు మూత పడకుండా సరికొత్త ఐడియా ని ఫాలో అవుతున్నారు. అంతే కాకుండా ఈ విషయంలో కనుమరుగవుతున్న పత్రిక రంగాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని పత్రికారంగ యాజమాన్యాలు గోల పెడుతున్నాయి.