తిరుపతి‌ ఉపఎన్నిక‌ ముగిసినా వైసీపీ‌ నేతలను వెంటాడుతున్న టెన్సన్

-

తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. మే 2న ఫలితాలు వెల్లడవ్వనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఓట్ల లెక్కల్లో మునిగి తేలాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న వైసీపీకి రెండు అంశాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఒక పక్క కరోనా కేసులతో పోలింగ్ తగ్గడం మరో పక్క దొంగ ఓట్ల అంశం వైసీపీ నేతలను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. విపక్ష పార్టీలతో పోలిస్తే తిరుగులేని విజయం సాధించే సత్తా ఉన్న వైసీపీని దొంగ ఓట్ల అంశం డ్యామేజ్ చేసిందా అన్న చర్చ పార్టీలో నడుస్తుంది.

ఎన్నికలకు ముందే పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు. లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యతలు అప్పగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఆ యా సెగ్మెంట్లలో గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ సాధించి చూపించాలని ప్రభుత్వ పథకాలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఇక ఉపఎన్నికలో డబ్బు పంపిణీ జోలికి వెళ్లని వైసీపీ తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓట్ల కలకలంతో కాస్త ఇబ్బందికి గురైంది. కరోనా భయంతో సాధరణ ప్రజలు పోలింగ్ కి దూరమయ్యారు దీంతో అతి కష్టం మీద పోలింగ్ 55 పర్సంట్ పైగా నమోదైంది.

లక్షల్లో మెజార్టీ టార్గెట్ పెట్టుకున్న వైసీపీ ఎన్ని దొంగ ఓట్లు వేస్తే ఆ మెజార్టీ టార్గెట్ కి రీచ్ అవ్వగలుగుతుంది. ఒక వేళ అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించిన ఒక ఐదు వేలు వేయిస్తే అదే పెద్ద ఘనం కానీ దొంగ నోట్లు వేయించి ఎన్నికల్లో గెలవాలని చూశారన్న విపక్షాల ఆరోపణలు, టీడీపీ అనుబంధ చానళ్లు చేసిన రచ్చ తో అచ్చం దొంగ ఓట్ల మీదే ఉపఎన్నిక వైసీపీ గెలవబోతుంది అన్న రేంజ్ లో ప్రచారం చేశారు. అధికార వైసీపీ ఇతర జిల్లాల నుంచి జనాలను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించిందన్న ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా గట్టి ప్రచారం చేశాయి టీడీపీ శ్రేణులు. దీంతో రేపు ఎన్నికల్లో గెలిచి భారీ మెజార్టీ సాధించినా అదంతా దొంగ ఓట్లతోనే జరిగిందన్న సాకుని విపక్షపార్టీలు వాడుకునే అవకాశం దక్కింది.

ఎన్నికల ఫలితాలు వైసీపీ ఏకపక్షంగా వచ్చి మంచి మెజార్టీ సాధించినా పొలింగ్ రోజు జరిగిన దొంగ ఓట్ల రచ్చని విపక్షపార్టీలు అడ్డుపెట్టుకునే చాన్సివ్వడంతో ఇప్పుడు డిఫెన్స్ లో పడింది వైసీపీ. ఎన్నికల్లో గెలుపు ఖాయమై మంచి మెజార్టీ దక్కే అవకాశం ఉన్నా ఈ దొంగ ఓట్ల అంశం మాత్రం ఉపఎన్నిక ముగిసి ఫలితాలు వచ్చే వరకు అధికారపార్టీని వదిలేలా లేదు. ఏడు నియోజకవర్గాల్లో కేవలం ఒక్క నియోజకవర్గంలో జరిగిన డ్యామేజ్ రేపు వైసీపీ ఘనవిజయం సాధించినా దాన్ని సెలబ్రేట్ చేసుకునే చాన్స్ లేకుండా చేసిందా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news