ఆర్ టీ పీసీఆర్ తోనూ తేలని కరోనా.. ఇకపై సీటీ స్కానింగ్ చేయాల్సిందే..

-

కరోనా సెకండ్ వేవ్ వీరవిహారం చేస్తున్న ప్రస్తుత సమయంలో టెస్టులు ఎక్కువగా జరుపుతున్నారు. ర్యాపిడ్ సహా, ఆర్ టీ పీసీఆర్ టెస్టులు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం, ఆర్ టీ పీసీఆర్ టెస్టుల్లోనూ కరోనా దొరకట్లేదని వెల్లడవుతుంది. ఆర్ టీ పీసీఆర్ టెస్టులో 80శాతం మాత్రమే సరైన నివేదిక వస్తుందని, మిగతా వారికి ప్రతికూల నివేదికలు వస్తున్నాయని అంటున్నారు. ఇటీవల గుజరాత్ లో చేసిన టెస్టుల్లో ఆర్ టీ పీసీఆర్ తో టెస్టుకి కరోనా దొరకలేదు. కానీ సీటీ స్కానింగ్ లో ఊపిరితిత్తుల్లో కరోనా ఉందని కనుగొన్నారు.

అధిక రిజల్యూషన్ ఉన్న సీటీ స్కానింగ్ వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న కరోనా కనబడుతుందని డాక్టర్లు వెలిబుచ్చారు. ఆకుపచ్చ, గోధుమ రంగు మచ్చలు కరోనా కారణంగానే ఏర్పడ్డాయని అంటున్నారు. వడోదరలోని ప్రైవేటు ఆసుపత్రుల సంస్థ సేతు ఛైర్మన్ కృపేష్ షా చెప్పిన దాని ప్రకారం, ఊపిరితిత్తుల్లో 25పాయింట్లలో 10పాయింట్లు ఉంటే గనక రోగి ఊపిరితిత్తులు ఇప్పటికే ప్రభావితం అయ్యుంటాయని వెల్లడి చేస్తున్నారు. ఆర్ టీ పీసీఆర్ వంద శాతం ఖచ్చితత్వం ఇవ్వలేదని, 70నుండి 80శాతం మాత్రమే అది సరైన ఫలితాలను ఇవ్వగలదని, అందువల్ల సీటీ స్కాన్ కి వెళ్ళాల్సిందేనని డాక్టర్లు చెబుతున్నారు.

రోజు రోజుకీ పెరుగుతున్న కేసులని చూస్తుంటే జనాల్లో భయాందోళనలు బాగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. పలు చోట్ల స్వచ్ఛంద లాక్డౌన్లు పెట్టుకుంటున్నారు. తెలంగాణలోనూ ఈ రోజు నుండి రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సెకండ్ వేవ్ భీభత్సం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో!

Read more RELATED
Recommended to you

Latest news