వివరణ ఇస్తూ .. ప్రెస్ నోట్ విడుదల చేసిన రమేశ్ కుమార్ ..

-

nimmagadda ramesh kumar : జగన్ సర్కారుకు ...

 

 

 

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ .. ఈ పేరు ఈ మధ్య కాలం లో ఆంధ్ర ప్రదేశ్ లో విపరీతంగా వినపడుతోంది. స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా ఉన్న రమేశ్ ని జగన్ ప్రభుత్వం పక్కన పెట్టి కొత్త కమీషనర్ ని తీసుకుని వచ్చినప్పటి నుంచీ జగన్ vs నిమ్మగడ్డ గా వ్యవహారం ముందుకు సాగుతోంది. రీసెంట్ గా వైకాపా ఎంపీ విజయ్ సాయి రెడ్డి నిమ్మగడ్డ ఆ మధ్య కేంద్రానికి రాసిన లేఖ గురించి విమర్శించిన సంగతి తెలిసిందే .. రమేశ్ కుమార్ రాసిన లేఖ ఫోర్జరీ కి గురి అయ్యింది అనీ అది తెలుగు దేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది అని ఆరోపించడమే కాకుండా కనకమేడల తో సహా మరొక ఇద్దరి పైన కేసు కూడా ఫైల్ చేశారు . ఈ నేపధ్యం లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు

ఇటీవల కేంద్ర హోంశాఖకు రాసిన లెటర్ పై అనేక వదంతులు వస్తున్నాయి. వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి కేంద్ర హోంశాఖ కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లెటర్ పైన విచారణ చేయించాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ నీ కోరడం జరిగింది. రమేష్ కుమార్ రాసిన లెటర్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని ఆయన పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన సంతకానికి అదేవిధంగా కేంద్రానికి రాసిన లెటర్ లో చేసిన సంతకానికి చాలా తేడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే టైమ్ లో వైసీపీ పార్టీ ఇదంతా టిడిపి నాయకులు చేసిన పని ఆరోపిస్తున్నారు. ఇటువంటి టైములో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన లెటర్ గురించి వస్తున్న వదంతులను ఉద్దేశించి వివరణ ఇస్తూ .. ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఆ లెటర్ తానే రాసినట్లు ఈ విషయంలో మిగతా వారికి సంబంధం లేనట్టు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి మరియు కేంద్ర హోంశాఖ కి మధ్య ఎటువంటి కాంట్రవర్షియల్ లేకుండా ఈ విధంగా వ్యవహరించినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలిపారు.

” మీడియా లో వస్తున్న వార్తలు చూస్తున్నాను .. కేంద్ర హోమ్ సెక్రటరీ దగ్గరకి నేను రాసిన లేఖ నాదా కాదా అనే విషయం మీద చాలా ఆరోపణలు వినిపిస్తున్నట్టు గా తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నేను ఈ లేఖ రాశాను ఆ హోదా లో ఉన్నప్పుడే రాశాను. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని దృవీకరించింది. మూడవ వ్యక్తి ఈ విషయం గురించి కంగారూ పడవలసిన అవసరం లేదు. అవసరం లేని వివాదం గా ఈ అంశాన్ని మార్చడం నాకు ఇష్టం లేదు. హోం శాఖ తో మాట్లాడుకునే బాధ్యత , అధికారం నాకు ఉన్నాయి ” అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ‘ ఇట్లు మాజీ రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్’ అంటూ ఆయన తన ప్రెస్ నోట్ ముగించడం కొసమెరుపు.

Read more RELATED
Recommended to you

Latest news