పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు నేను బాధపడటం లేదు. నాకు పదవులు ముఖ్యం కాదు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పాటుపడే పార్టీ… అని నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత అన్నారు.
ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు, ఓటములు సహజం. పదవి ఉన్నా… లేకున్నా నేను నిజామాబాద్ ను వదిలిపెట్టను. ప్రజల సమస్యల పరిష్కారం కోసం, జిల్లా అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా. పార్టీ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దు. హుందాగా ఉందాం. బంగారు తెలంగాణ కోసం పనిచేద్దాం.. అని కవిత పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు నేను బాధపడటం లేదు. నాకు పదవులు ముఖ్యం కాదు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పాటుపడే పార్టీ… అని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓటమి చెందడాన్ని తట్టుకోలేక నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కిశోర్ ఈనెల 24న గుండె పోటుతో మరణించాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులను కవిత పరామర్శించారు. కిషోర్ కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. తను, టీఆర్ఎస్ పార్టీ కిశోర్ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.