కారులో జంపింగులకు మళ్ళీ నో ఛాన్స్?

-

రాజకీయాల్లో ప్రజా తీర్పుని ఎప్పుడు గౌరవించాలి…అప్పుడే ఏ నాయకుడుకైన రాజకీయంగా మనుగడ ఉంటుంది…అలా కాకుండా ప్రజా తీర్పుకి రివర్స్ గా వెళితే…ఎప్పటికైనా దెబ్బతినాల్సిందే..ఇలా ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వెళ్ళిన నాయకులని మళ్ళీ ప్రజలు ఆదరించడం జరగదు…ఏదో కొన్ని సందర్భాల్లో అదృష్టం కొద్ది ప్రజల ఆదరణ తగ్గుతుంది…అయితే అదే ఆదరణ మళ్ళీ మళ్ళీ దక్కాలంటే కష్టం.

ఈ సారి తెలంగాణ రాజకీయాల్లో ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా వెళ్ళిన నాయకులని ప్రజలు ఆదరించేలా లేరు. ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలోకి జంప్ చేసిన నేతలకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చేలా లేరు. గత ఎనిమిదేళ్లుగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచి…మరొక పార్టీలోకి వెళ్లారో తెలిసిందే. టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు…టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుసపెట్టి..టీఆర్ఎస్ లోకి వచ్చారు. అయితే ఈ జంపింగ్ ఎమ్మెల్యేలకు అదృష్టం కలిసొచ్చి 2018 ఎన్నికల్లో మరొకసారి గెలిచారు…కేసీఆర్ మళ్ళీ సెంటిమెంట్ రగల్చడం…పైగా టీఆర్ఎస్ లో పూర్తి స్థాయిలో నేతల పోటీ లేక..సీట్ల కోసం ఆధిపత్య పోరు తక్కువగా జరిగింది.  పైగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం కలిసొచ్చింది…ఫలితంగా జంపింగ్ ఎమ్మెల్యేలు మరొకసారి గెలవగలిగారు.

 

అయితే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా..కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ చేశారు. అసలు టీఆర్ఎస్ పార్టీకు ఫుల్ బలం ఉంది అయినా సరే…ఇతర పార్టీ ఎమ్మెల్యేలని చేర్చుకుంది. ఎమ్మెల్యేలు కూడా అధికారం కోసం ఆశపడి…ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ముందుకెళ్లారు. ఇక అధికార పార్టీలోకి వచ్చాక…జంపింగ్ ఎమ్మెల్యేలు…ప్రజల కోసం ఎలా పనిచేశారో తెలియదు గాని…వారు సొంత పనులు మాత్రం బాగా చేసుకున్నట్లే కనిపిస్తున్నారు.

పైగా జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నచోట…ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో పెరిగింది…ఎక్కడకక్కడ నేతల మధ్య రగడ జరుగుతుంది…సీట్ల కోసం నేతల మధ్య వార్ నడుస్తోంది…పైగా ప్రతిపక్ష పార్టీలు పుంజుకున్నాయి…అలాగే మళ్ళీ సెంటిమెంట్ లేపడం కష్టం…ఈ పరిణామాలని బట్టి చూస్తే…ఈ సారి జంపింగ్ ఎమ్మెల్యేలని ప్రజలు ఓడించేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news