హుజూర్‌లో కాంగ్రెస్ బేజారు.. రేవంత్‌కు నో డ్యామేజ్?

-

హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు…ఎవరెవరి మధ్య జరిగిందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు..ఇక్కడ పార్టీలు లేవు….టీఆర్ఎస్-బీజేపీలు అనే పేరు లేదు. కేవలం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగానే పోరు నడిచింది. అహంకారం-ఆత్మగౌరవం మధ్య పోటీ జరిగిందనే చర్చలు నడిచాయి. అయితే ఇక్కడ మొదట నుంచి కాంగ్రెస్ పాత్ర ఎలా ఉంటుందో…అందరికీ క్లారిటీ వచ్చేసింది..ఆ విషయం కొత్తగా టి‌పి‌సి‌సి పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డికి కూడా తెలుసు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అయితే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్ ఉంది…గత ఎన్నికల్లో ఇక్కడ 60 వేల ఓట్లు వరకు కాంగ్రెస్‌కు పడ్డాయి. కానీ కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్లుగా జరిగిన ఈ పోరులో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు పడవని అందరికీ తెలుసు. అందుకే రేవంత్ కూడా హుజూరాబాద్ ఉపఎన్నికకి సీరియస్‌గా తీసుకోలేదు. పైగా ఆయన కేసీఆర్‌ని ఓడించాలని అనుకున్నారు…గానీ కాంగ్రెస్‌ని గెలిపించాలని అనుకోలేదు. అలా అనుకుంటే ఓట్లు చీలిపోయి, కాంగ్రెస్ ఓడేది…ఈటల కూడా ఓడిపోయేవారు.

అందుకే రేవంత్ ఈ ఎన్నికని చాలా లైట్ తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డాయి. ఈటల…టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై దాదాపు 24 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిస్తే…ఇక్కడ కాంగ్రెస్‌కు 2767 ఓట్లు పడ్డాయి. అంటే చాలా దారుణంగా ఓట్లు పడ్డాయి. ఇలా కాంగ్రెస్‌కు ఓట్లు పడటం వల్లే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పాలి. ఒకవేళ కాంగ్రెస్ 25 వేల ఓట్లు తెచ్చుకునే ఉంటే…పరిస్తితి మొత్తం మారిపోయేది.

అయితే కాంగ్రెస్ ఓటమిని ఇప్పుడు కొందరు సీనియర్లు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి లాంటి వారు రేవంత్‌ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఇదంతా రేవంత్‌పై కోపంతో సీనియర్లు ఆడుతున్న పోలిటికల్ గేమ్ అని, హుజూరాబాద్ ఉపఎన్నిక వల్ల రేవంత్‌కు డ్యామేజ్ ఏం ఉండదని, యథావిధిగానే రేవంత్…కేసీఆర్‌పై పోరాటం చేస్తారని, టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని రేవంత్ అనుకూల వర్గం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news