మంత్రి పదవి ఎఫెక్ట్: ఆ సీనియర్ ఎమ్మెల్యే వాయిస్ అందుకే మారిందా?

-

తెలంగాణలో చాలామంది అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కలేదని లోలోపల టి‌ఆర్‌ఎస్ అధిష్టానంపై రగులుతున్నట్లు ఉన్నారు. కానీ కొందరు మాత్రం పైకి తమ అసంతృప్తిని వెళ్లగక్కేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరావులు మంత్రి పదవి దక్కకపోవడంపై కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది.

 

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

కడియం లాంటి నాయకులైతే పరోక్షంగా పార్టీపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కడియంకు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇస్తారని తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. దీంతో కడియం కాస్త చల్లబడినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సైతం, పార్టీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. టీఆర్‌ఎస్ పార్టీకి శాశ్వతమేం కాదంటూ మాట్లాడిన లక్ష్మారెడ్డి, గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా శాశ్వతంగా ఏమీ అధికారంలో లేదని అన్నారు. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా బాధ్యతగా ఉండాలని, ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషించాలన్నారు. అయితే టి‌ఆర్‌ఎస్‌లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మారెడ్డి సడన్‌గా ఇలా వేదాంతంగా మాట్లాడటంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.

గతంలో కే‌సి‌ఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డికి రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అయితే మంత్రి పదవి అంశంలోనే ఇలా లక్ష్మారెడ్డి, సొంత పార్టీకి కూడా చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఈయన మంత్రిగా ఉండుంటే…ఇలాంటి మాటలు వచ్చేవి కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మంత్రి పదవి కావాలని కే‌సి‌ఆర్‌కు పరోక్షంగా హింట్ ఇస్తున్నట్లు కనబడుతోందని అంటున్నారు. మరి చూడాలి లక్ష్మారెడ్డికి మంత్రి పదవి వస్తుందో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news