పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పార్లమెంటరీ కమిటీలు..

-

JanaSena election symbol Glass Tumbler

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీలన్నీ గెలుపే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ఏపీలో అటు అసెంబ్లీ.. ఇటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశమంతా ప్రస్తుతం ఏపీ ఎన్నికలపై.. అక్కడి రాజకీయాలపై దృష్టి సారించింది. ఇక.. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పోటీ చేయకుండా వచ్చిన జనసేన.. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే పార్లమెంటరీ కమిటీలను స్వయంగా జనసేన అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ పదవులకు జరుగుతున్న ఎంపిక ప్రక్రియ చాల నిశితంగా జరుగుతోంది. అర్హతలను బట్టి ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలలో పవన్ కళ్యాణ్ స్వయంగా నియమిస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి సముచిత స్టానం కల్పించడానికి ఆయన కృతనిశ్చయంతో వున్నారు. ఇప్పటికి ఐదు పార్లమెంటరీల కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేశారు. నరసాపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి కమిటీలు సిద్ధమయ్యాయి. నరసాపురం జాబితా నిన్న ప్రకటించినందున మిగిలిన వాటి వివరాలు వరుసగా..

* గ్రూప్ 1 సర్వీస్ నుంచి…

గ్రూప్ 1 అధికారిగా విధుల్లో ఉన్న టి.శివశంకర రావు ఏడాది కిందటే పవన్ కళ్యాణ్ భావజాలానికి ఆకర్షితులై ఉద్యోగానికి స్వచ్చంద పదవి విరమణ చేసి జనసేనలో చేరారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకొంటున్నారు. శ్రీకాకుళంలో సిద్దార్థ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి – పేద ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చారు. జనసేన అధికార ప్రతినిధిగా, సోషల్ జస్టిస్ విభాగం కన్వీనర్ గా సేవలందించారు.

* డా.బొడ్డేపల్లి శ్రీరామమూర్తి:శ్రీకాకుళం జిల్లా అక్కులపేట గ్రామంలో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన శ్రీరామమూర్తి గారు వైద్య విద్యను అభ్యసించారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదలకు చేరువయ్యారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

* కూరాకుల యాదవ్: సాధారణ ఎస్సీ కుటుంబం నుంచి వచ్చిన యాదవ్ విజయవంతమైన యువ వ్యాపారవేత్తగా నిలిచారు. బడుగు, బలహీన వర్గాల వారికి సాయం అందిస్తుంటారు. జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

* మైలపల్లి శ్రీనివాసరావు: వృత్తిరీత్యా టాక్స్ కన్సల్టెంట్ అయిన శ్రీనివాసరావు ప్రవృతిరీత్యా సామాజిక సేవకులు. తిత్లీ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధిత ప్రజలకు సాయం అందించారు.

* ధర్మాన ఉదయ్ భాస్కర్: వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఉదయ్ భాస్కర్ సామాజిక దృక్పథం ఉన్న నాయకుడు. జనసేన సిద్దాంతాలకు ఆకర్షితులై పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లే కార్యక్రమాలు చేపడుతున్నారు.

* బడన వెంకట జనార్ధనరావు :ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన జనసేన నాయకులు. గ్రామీణ ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

* కోన తాతారావు : బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తపించే నాయకుడు. వెనకబడిన వర్గాల సంక్షేమ సంఘం చైర్మన్ గా సేవలు అందించిన తాతారావు బీసీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. విశాఖపట్నం నగర ప్రజలకు చిరపరిచితులైన నాయకులు తాతారావు.

* బొలిశెట్టి సత్యనారాయణ: ప్రముఖ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ. నదుల పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం పలు ఉద్యమాలు చేపట్టారు. భూసేకరణ చట్టం అమలులో లోపాలపైనా, అమరావతి రైతుల తరఫున నిర్వహించిన ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారు.

* ఎం.రాఘవరావు: గత 30 సంవత్సరాలుగా సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నాయకుడు ఎం.రాఘవరావు. స్వతహాగా మెగా కుటుంబ అభిమాని అయిన ఈయన జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు.

* బొగ్గు శ్రీనివాసరావు: విశాఖపట్నంలోని పేదల పక్షాన నిలుస్తూ పలు సామాజిక ఉద్యమాల్లో ముందు ఉండే యువ నాయకుడు బొగ్గు శ్రీనివాసరావు. జనసేన తరఫున చురుకుగా కార్యక్రమాలు చేపడుతున్నారు.

* తిప్పల రమణారెడ్డి: స్వతహాగా చిరంజీవి అభిమాని అయిన రమణారెడ్డి గాజువాక ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. జనసేన పక్షాన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ సిద్దాంతాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తుంటారు.

* గడసాల అప్పారావు:ఐ.ఎన్.టి.యు.సి లో రాష్ట్ర నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేశారు అప్పారావు. కార్మిక నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. జనసేన విజయనగరం జిల్లా జాయింట్ కో-ఆర్డినేటర్ గా పని చేశారు.

* అలివర్ రాయ్: విద్యా సంస్థల నిర్వాహకుడైన అలివర్ రాయ్ విశాఖ ప్రాంతవాసులకు పరిచితులు. రాష్ట్ర క్రిస్టియన్ మిషనరీలకు నాయకుడీయన. మిషనరీల ద్వారా పేదలకు సేవలు అందిస్తున్నారు.

* బొమ్మదేవర శ్రీధర్ (బన్ను)జనసేనలో క్రియాశీలక నాయకులైన బొమ్మదేవర శ్రీధర్ (బన్ను) నరసాపురం పార్లమెంటరీతో పాటు రాజమండ్రి పార్లమెంటరీ రీజనల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. భీమవరం ప్రాంతంలో యువతను కలుపుకొంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. జనసేనలో తొలి నుంచి చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

జనసేన శ్రీకాకుళం పార్లమెంటరీ కమిటీ

పవన్ కళ్యాణ్ పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీల నియామకంలో భాగంగా శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి కమిటీని నియమించారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా టి. శివ‌శంక‌రరావు, కార్యదర్శిగా డా. బొడ్డేప‌ల్లి శ్రీరామ్మూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కూరాకుల యాద‌వ్‌, మైల‌ప‌ల్లి శ్రీనివాస‌రావు, ధ‌ర్మాన ఉద‌య్‌భాస్క‌ర్‌, బ‌డ‌న వెంక‌ట జ‌నార్ధ‌న్‌రావు,  వైస్ చైర్మన్ గా పెడాడ రామ్మోహ‌న్‌, కోశాధికారిగా గేదల శంక‌ర్‌రావు, అధికార ప్రతినిధులుగా సంతోష్ పాండ‌, ముడిదాన రామ్‌ప్ర‌సాద్‌లను నియమించారు. లీగల్ విభాగానికి బి. ఫల్గుణ‌రావులను ఎంపిక చేశారు. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులు

1 .ఇలుగుండ గురుప్ర‌సాద్‌

2 .స‌ల‌స ష‌ణ్ముఖ‌రావు

3 .మ‌జ్జిఆశా

4 .అట్టాడ శ్రీధ‌ర్‌

5 .అడ‌పాక అశోక్‌

6 .బొండాడ మ‌హేష్‌

7 .పైడి ముర‌ళీ మోహ‌న్‌

8 .మామిడి కృష్ణమూర్తి

9 .ఎం. మ‌నోజ్‌కుమార్‌

  1. కొండా ఉద‌య్‌శంక‌ర్‌

వర్కింగ్ కమిటీ సభ్యులు

1 .సంజు రెడ్డి

2 .పృథ్వీరాజ్‌

3 .డి. న‌ర్శింహారెడ్డి

4 .మ‌ద్దు ర‌వికుమార్‌

5 .ఎస్‌. మ‌ణిసంతోష్‌

6 .బంగారి కేదారినాథ్‌

7 .క‌డ్డాల చిరంజీవి

8 .వి. సింహాచ‌లం

9 .ప‌ల్లె కోటేశ్వ‌ర‌రావు

10 .ధవళ వెంక‌టేష్‌

11 . పాగోటిఅనిల్ కుమార్

12 .మేడిబోయిన తిరుప‌తిరావు

  1. పైడి ధ‌నుంజ‌య‌
  2. భార్గ‌వ్‌
  3. మీసాల రాజు
  4. కంచ‌రాన‌సాయిప్ర‌తాప్
  5. దొంపాక‌జ‌య‌రాజ్
  6. ఈ.సాయి వెంక‌ట్‌
  7. మ‌హ్మ‌ద్ ర‌ఫీ
  8. ఎం. రామ‌చంద్ర‌
  9. ప‌డాల ఆనంద్‌
  10. కంచ‌రాన అనిల్‌
  11. దుగాన సురేష్‌
  12. బోడ‌సింగి చిన్నా
  13. తుల‌గాపు మౌళి

జనసేన విశాఖ‌ప‌ట్నం పార్లమెంటరీ కమిటీ

జనసేన విశాఖ‌ప‌ట్నం పార్లమెంటరీ కమిటీకి రీజనల్ సెక్రటరీగా కోన తాతారావు, కార్యదర్శిగా బొల్లిశెట్టి స‌త్య‌నారాయ‌ణ‌, ఆర్గనైజింగ్ కార్యదర్శులు గా ఎం. రాఘ‌వ‌రావు, బొగ్గు శ్రీనివాస‌రావు, తిప్ప‌ల ర‌మ‌ణారెడ్డి, గ‌డ‌సాల అప్పారావు, అలివ‌ర్ రాయ్‌,  వైస్ చైర్మన్ గా పి.వి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, కోశాధికారిగా తోట స‌త్య‌నారాయ‌ణ‌, అధికార ప్రతినిధులుగా యు .ప్ర‌వీణ్‌బాబు, చోడిపిల్లి ముస‌ల‌య్య‌లను నియమించారు. సిటిజ‌న్‌ కౌన్సిల్ కి నండూరి రామ‌కృష్ణ‌, లీగల్ విభాగానికి వై. మార్కండేయ‌లను ఎంపిక చేశారు. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులు

1 .బొండప‌ల్లి దేవి

2 .సుర‌వ‌ర‌పు రామ‌న్ సుబ్బారావు

3 .క‌ల్ల మ‌ణిప్ర‌సాద్‌

4 .మాధ‌వీ విజ‌య దుర్గా బండి (జ‌య నాయుడు)

5 .న‌క్కా ర‌మ‌ణారావు

6 .పి.వి.ఎన్ రాజు

7 .మ‌ల్లువ‌ల‌స శ్రీను

8 .మోకా స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి (నాని)

9 .వాసుప‌ల్లి న‌రేష్‌

  1. గుంటూరు ల‌క్ష్మీన‌ర్శింహ‌మూర్తి
  2. యీవూరి విజ‌య‌రామ‌రాజు

వర్కింగ్ కమిటీ సభ్యులు

1 .ఐల‌పు క‌న‌క‌రాజు

2 .కాకుల‌వ‌ర‌పు శ్రీహ‌ర్ష‌

3 .గొన్నాబ‌త్తుల‌ అప్ప‌ల‌రాజు

4 .పి.సాయికృష్ణ‌

5 .అంగ దుర్గా ప్ర‌శాంతి

6 .లెంక త్రినాథ్‌

7 .జి.మంగ‌

8 .నీలం రాజు

9 .బీశెట్టి గోపీకృష్ణ‌

10 .క‌ఠారి జ్యోత్స్న‌

11 .రేసు మోహ‌న్‌రాజ్‌

12 .కృష్ణా రెడ్డి

  1. పి. మధుసూద‌న్‌రావు
  2. ప‌రువాడ శిరీష‌
  3. మున‌ప‌ర్తి ర‌వికుమార్‌
  4. భోగిల శ్రీనివాస్ ప‌ట్నాయ‌క్‌
  5. కర్న రామారావు
  6. సీరెడ్డి అప్పారావు
  1. అన్నం తిరుప‌తిరావు
  2. పి. భాస్క‌ర‌రాజు
  3. ఆకుల ఉద‌య్‌భాస్క‌ర్‌
  4. దొర‌బాబు
  5. అట్టా అప్పారావు
  6. బ‌రాటం సంతోష్‌కుమార్‌
  7. జి.వై.సంతోష్ నాయుడు
  8. అప్ప‌ల‌రాజు గ‌డ్డిప‌ల్లి
  9. వేముల ఈశ్వ‌ర్‌రెడ్డి
  10. మంచిన‌అప్ప‌న్న‌దొర
  11. జె. స‌త్తిబాబు
  12. సింహం ప‌ల్లు ఎర్రిన్‌బాబు
  13. పిల్లా సురేష్‌
  14. ఎల్లాజి చిన్న‌మ‌న‌(చారి)

జనసేన రాజమండ్రి పార్లమెంటరీ కమిటీ

జనసేన రాజమండ్రి పార్లమెంటరీ కమిటీకి రీజనల్ సెక్రటరీగా బొమ్మదేవర శ్రీధర్ (బన్ను), కార్యదర్శిగా డా.ఆకుల సత్యనారాయణలను నియమించారు.  ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా  అత్తి సత్యనారాయణ, కె.హారిక, ఎ.వి.ఎన్.ఎస్.రామచంద్ర రావు, వైస్ చైర్మన్ గా యర్నాగుల శ్రీనివాసరావు, కోశాధికారిగా సూరంపూడి పోలరాజు,  అధికార ప్రతినిధులుగా ద్వారంపూడి సతీష్ కుమార్ రాజా, జె.వి.సత్యనారాయణ, లీగల్ విభాగానికి తోరాటి వసంత రావులను నియమించారు. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ

1 .నామాల శ్రీవెంకట పద్మావతి

2 .మన్యం సెంథిల్ కుమారి

3 .నంద్యాల లక్ష్మి

4 .యండం ఇందిర

5 .ఆకాశం వెంకట్రావు

6 .సబ్బా రాజేష్ ఖన్నా

7 .అత్తిలి రాజు

8 .వి.సత్యనారాయణ రెడ్డి

9 .పి.ఎస్.ఆర్.ఎన్.కోటేశ్వర రావు (రాంబాబు)

10 .షేక్ బాషా

11 .దాసరి గుర్నాథ రావు

వర్కింగ్ కమిటీ

1 .మన్యం శిరీష

2 .టి.ఎన్.ఎల్.ఎన్.మూర్తి

3 .వై.శివ కార్తిక్ జయంత్

4 .ఏడిద బాబీ

5 .కాలెపు సాయి లక్ష్మి

6 .కాకర్ల నర్సన్న

7 .పి.వి.ఎస్.ఎన్.స్వామి నాయుడు

8 .మట్టపర్తి నాగరాజు

9 .గంగాబు  తిరుమల్నాథ్

10 .బొబ్బరాడ శ్రీనివాస్

11 .ఎం.వెంకటేశ్వర రావు

12 .మన్యం శ్రీను

13 .చిట్టి బ్రహ్మం

14 .తోటకూర కృపానందం

15 .యానాల కొండయ్య

16 .అద్దంకి చక్రధరరావు

17 .బుద్దాల సూర్యనారాయణ

18 .అచ్యుత రాయుడు

19 .అనుమరెడ్డి ఆంజనేయులు

20 .కంఠం గణేష్

21 .అనిసెట్టి గంగరాజు

22 .గంధం అయ్యప్ప

23 .కటకం రామకృష్ణ

24 .వర్రే  రమేష్

25 .అరిగల రాజు

26 .వాకా నాగరాజు

27 .చప్పటి శివకుమార్

28 .చెట్టే సుభాషిణి

29 .గెడ్డం శివరత్న గణపతి

30 .ఆకుల భాస్కర రావు

31 .గండ్రోతు పవన్ సోమరాజు

32 .సయ్యద్ సలీం

Read more RELATED
Recommended to you

Latest news