పవన్ కన్ఫ్యూజన్ పాలిటిక్స్..బాబు ప్లానింగ్ ఉందా!

-

టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? ఇప్పటికీ అంతు తేలని ప్రశ్న..చంద్రబాబు-పవన్ కలిసి పనిచేస్తారా? అంటే కలిసి పనిచేస్తారనే అంతా అనుకుంటారు..కానీ పైకి చూస్తే మాత్రం ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. దీని వల్ల పొత్తుపై క్లారిటీ ఉండటం లేదు. అంటే ఇది రాజకీయ వ్యూహంలో భాగంగా జరుగుతుందా? లేక నిజంగానే టి‌డి‌పి, జనసేనలు కన్ఫ్యూజన్ లో ఉన్నాయా? అనేది తెలియడం లేదు.

అయితే అరాచక పాలన చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తాము కలుస్తున్నామని బాబు, పవన్ మూడుసార్లు కలిశారు. దీంతో క్షేత్ర స్థాయిలో పొత్తుకు సిగ్నల్స్ వెళ్ళాయి. ఇక ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని వైసీపీ ఫిక్స్ అయింది. అందుకే పొత్తు ఉంటే తమకు ఇబ్బంది అని తెలిసి..దమ్ముంటే సింగిల్ గా రావాలని ఆ రెండు పార్టీలని రెచ్చగొడుతున్నారు. అదే సమయంలో ఒకోసారి పొత్తు దిశగా వెళుతున్నట్లు కనిపించిన మరొకసారి. అసలు పొత్తు లేదా అన్నట్లు పరిస్తితి ఉంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పొత్తుల విషయంలో కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు.

మొదట వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అన్నారు..అలాగే అవసరమైతే సి‌ఎం పదవి త్యాగం చేస్తానని అన్నారు. ఇప్పుడేమో జనసేనకు అధికారం ఇవ్వాలని, తనని గెలిపించాలని పవన్ కోరుతున్నారు. అసలు పొత్తుల గురించి చంద్రబాబు మాట్లాడటం లేదు. ముందు టి‌డి‌పిని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టారు. ఇటు పవన్ కూడా అలాగే ఫోకస్ చేశారు. వారాహి యాత్ర చేస్తూ జనసేనని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టి ముందుకెళుతున్నారు.

ఇలా ఎవరికి వారే పనిచేస్తున్నారు. ఇక ఇలా చేయడం వల్ల వైసీపీని కన్ఫ్యూజన్ లో పెడుతున్నారని చెప్పవచ్చు. బాబు, పవన్ పక్కా ప్లానింగ్ తోనే ఇదంతా చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఎన్నికల ముందు టి‌డి‌పి, జనసేన పొత్తు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది..అందులో ఎలాంటి డౌట్ లేదట. ఇక వీరితో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది నెక్స్ట్ అంశం.

Read more RELATED
Recommended to you

Latest news