బ్లైండ్ గా ఫాలోఅయిపోతే ఇలానే ఉంటుంది పవన్!

-

ఒక విధానంతో.. ఒక విజన్ తో పోకపోతే, రాజకీయ నాయకులు ఇరకాటంలో పడిపోతుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి జనసేన అధినేత పవన్ కల్యాన్ కు వచ్చింది. అందుకు కారణం అయిన విషయం.. వినాయక చవితి – స్టాలిన్ పై పొగడ్తలు! మిత్రపక్షం బీజేపీ చెప్పిందనో.. పాత మిత్రుడు చంద్రబాబు ఎత్తుకున్నారో.. వెనకాముందూ చూసుకోకుండా స్పందించేస్తే ఇబ్బందులు తప్పవు!

దేశంలో చాలా రాష్ట్రాలు వినాయ‌క చ‌వితి సామూహిక ఉత్స‌వాల‌ను ర‌ద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవ‌రికి వారు ఇంట్లో వినాయ‌క చ‌వితిని జ‌రుపుకోవాల‌ని.. సామూహిక ఉత్స‌వాలు – ఊరేగింపులు వ‌ద్ద‌ని వివిధ రాష్ట్రాలు చెబుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు – మిగిలిన పార్టీల రాష్ట్రాలు అనే తారతమ్యాలేమీలేవు. ఈ విషయంలో ఇప్పటికే ఏపీ, మ‌హారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఇటువంటి ప్రకటనలు చేయగా… ఆ జాబితాలో ఇప్పుడు త‌మిళ‌నాడు చేరింది.

తాజాగా… తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కూడా వినాయ‌క చ‌వితి సామూహిక ఉత్స‌వాల‌ను ర‌ద్దు చేసింది. ఇళ్ల‌లోనే పండ‌గ జ‌రుపుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. కోవిడ్ ప‌రిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ అంశంపై బీజేపీ విబేధించింది.. ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. మరి.. ఏపీలో ఈ ఆంక్షలపై తీవ్రంగా స్పందించిన పవన్ కల్యాణ్… తమిళనాడు ప్రభుత్వ విధానాలపై కూడా స్పందిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దేశంలోని ముఖ్యమంత్రులకు స్టాలిన్ ఆదర్శం అంటూ ఈమధ్యే పవన్ కల్యాన్ కితాబిచ్చిన సంగతి తెలిసిందే. అలా ప‌వ‌న్ చేత ప్ర‌శంస‌లు అందుకున్న స్టాలిన్ ప్ర‌భుత్వం కూడా వినాయ‌క‌చ‌వితి సామూహిక ఉత్స‌వాల‌ను ర‌ద్దు చేసింది. దీంతో పవన్ ఇరకాటంలో పడ్డట్లయ్యింది! ఏపీలో పవన్ చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా.. స్టాలిన్ నిర్ణయం తీసుకున్నట్లయ్యింది. మరి ఈ విషయంలో “స్టాలిన్ సర్కార్ ది తప్పు” అని పవన్ చెబుతారా… లేక “ఏపీలో జగన్ దీ మాత్రమే తప్పుడు నిర్ణయం.. తమిళనాడులో స్టాలిన్ ది సరైన నిర్ణయం” అని ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తారా?

ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలనుకుంటే.. ఇండివిడ్యువల్ గా ఆలోచించాలి. సోకాల్డ్ రాజకీయ నాయకుల పంథాలో పోవాలంటే.. పూర్తిగా వారిలాగానే ఆలోచించాలి. అంతే కాని రెండు పడవడలపై కాలేస్తానంటే… పరిస్థితి ఇలానే ఉంటుందని ఈ సందర్భంగా పవన్ కు పలువురు సూచిస్తున్నారు. సొంత నిర్ణయాలు తీసుకోవాలే తప్ప… పాతమిత్రులు – కొత్త మిత్రుల మాటలు విని బ్లైండ్ గా వెళ్లిపోతే ఇలాంటి ఇబ్బందులు తప్పవు అన్న విషయం పవన్ గ్రహించాలి.

Read more RELATED
Recommended to you

Latest news