పవన్ రూట్ క్లియర్: సీఎం బాబు?

-

మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ రూట్ క్లియర్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది..ఇంతకాలం ఆయన సొంతంగా రాజకీయం చేస్తూ..తమ పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు కనిపించారు గాని..నిదానంగా ఆయన చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని వైసీపీ నేతల చేసే విమర్శలని నిజం చేసేలా కనిపిస్తున్నారు..ఆ దిశగానే పవన్ పని చేస్తున్నట్లు ఉన్నారు. ఎలాగైనా టీడీపీతో పొత్తు పెట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతోనే పవన్ పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

కాస్త రాజకీయాలు గురించి తెలిసిన వారికి..ఈ విషయం సులువుగా అర్ధమవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్తుతుల్లో జనసేన సింగిల్ గా పోటీ చేసి సత్తా చాటడం జరిగే పని కాదు…ఒకవేళ బీజేపీతో కలిసి ఉన్నా సరే పెద్దగా ఉపయోగం లేదు..ఎందుకంటే ఏపీలో బీజేపీకి పెద్ద బలం లేదు..అలా అని జనసేనకు కూడా అనుకున్నంత బలం లేదు. ఆ పార్టీకి ఎంత బలం ఉందో 2019 ఎన్నికల్లోనే అర్ధమైంది. అయితే ఇప్పటికీ కాస్త పరిస్తితి మారినా సరే..ఇంకా జనసేన పొజిషన్ సింగిల్ డిజిట్ సీట్లని గెలుచుకునే పరిస్తితే ఉంది.

కాసేపు పవన్ విషయం పక్కనపెడితే..ఏపీలో అధికార వైసీపీకి ఎక్కువ బలం కనిపిస్తోంది..ఆ బలాన్ని తగ్గించి అధికారం చేజిక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుంది..అయితే టీడీపీకి పూర్తి స్థాయిలో వైసీపీకి చెక్ పెట్టే బలం వచ్చినట్లు కనిపించడం లేదు..అందుకే ఆ పార్టీ..జనసేనతో కలిసి ముందుకెళ్లాలని చూస్తుంది. జనసేనతో కలిస్తేనే లాభం అనేది చంద్రబాబుకు బాగా అర్ధమైంది..అలాగే చంద్రబాబుకు దగ్గరైతేనే బెటర్ అనేది పవన్ కు తెలుసు. అందుకే ఇద్దరు పరోక్షంగా పొత్తుల గురించి మాట్లాడుతున్నారు..అలాగే వైసీపీపై ఒకే రకమైన విమర్శలు కూడా చేస్తున్నారు.

ఎప్పుడు తనదైన శైలిలో విమర్శలు చేసే పవన్…ఇప్పుడు బాబు లైన్ లోనే విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు..ఈ మధ్య పవన్ చేసే విమర్శలు అలాగే కనిపిస్తున్నాయి…తాజాగా శ్రీలంక పరిస్తితే ఏపీలో కూడా వస్తుందని విమర్శించడం కూడా అదే తీరులో ఉంది…మొత్తానికి బాబు బాటలోనే పవన్ వెళుతున్నట్లు కనిపిస్తున్నారు. బాబుని మళ్ళీ సీఎం చేయడానికి కష్టపడుతున్నట్లున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news