ఊహలపల్లకిలో జనసేనాని..అధికారం దక్కేస్తుందా?

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఊహల పల్లకిలో ఎక్కువ ఊరేగుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల సభల్లో ప్రతిసారి జనసేన ప్రభుత్వం వస్తుందని చెబుతున్నారు. మన ప్రభుత్వం వస్తే అద్భుతంగా పాలిస్తామన్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఇలా చెప్పడం తప్పు లేదు. ఎవరైనా అధికారంలోకి రావాలని అనుకుంటారు. కానీ రియాలిటీకి దగ్గరగా ఉండాలి.

తాము అధికారంలోకి వస్తామని మళ్ళీ వైసీపీ చెప్పిన, అటు టి‌డి‌పి చెప్పిన ఒక అర్ధం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీల బలం ఉంది. కానీ జనసేనకు ఆ బలం లేదు. కేవలం 30 సీట్లలో కూడా గెలిచే సామర్థ్యం లేదు. 10 శాతం ఓట్లు ఉన్నాయి. 10 సీట్లు కూడా గెలవడం కష్టమనే పరిస్తితి. దీని బట్టి చూస్తే జనసేన ప్రభుత్వం అనేది ఏర్పడటం జరిగే పని కాదు. పోనీ టి‌డి‌పితో పొత్తులో పోటీ చేస్తే అప్పుడు జనసేన ప్రభుత్వం అవ్వదు..అది టి‌డి‌పి-జనసేన ప్రభుత్వం అవుతుంది. దాదాపు అంతా టి‌డి‌పి ప్రభుత్వమే అంటారు.

దీని బట్టి చూస్తే పవన్ జనసేన ప్రభుత్వమని చెప్పడం అనేది కాస్త రియాలిటీకి దూరంగా ఉందనే చెప్పాలి. తాజాగా జనవాణి కార్యక్రమంలో పవన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దివ్యాంగుల సమస్యలు విన్న పవన్.. తాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దివ్యాంగులను గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల దగ్గరికి వచ్చేలా చేస్తానని చెప్పారు.

ఇక్కడ జనసేన ప్రభుత్వం అనేది రావడం కష్టమైన విషయం. ఇంకొకటి టి‌డి‌పితో కలిసిన డౌటే. వైసీపీనే మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news