పెద్దిరెడ్డి ఫ్యామిలీ..ట్రిపుల్ ధమాకా.. వన్‌సైడ్ విక్టరీ.!

-

ఏపీ రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు.. రాయలసీమలో పవర్‌ఫుల్ నాయకుడు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు..ఈయన సొంత జిల్లా కూడా. అక్కడ బాబుకు చుక్కలు చూపిస్తూ..జిల్లాని వైసీపీ పరం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ 14కి 13 స్థానాలు..2 ఎంపీ స్థానాలు గెలవడానికి కారణం జగన్ ఇమేజ్, పెద్దిరెడ్డి కష్టం కూడా ఉంది.

అలా బాబు జిల్లాని వైసీపీ పరం చేశారు. ఇక బాబు కంచుకోట కుప్పం కూల్చే దిశగా వెళుతున్నారు. అలా తిరుగులేని నాయకుడుగా ఉన్న పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి వైసీపీలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. రాజంపేట ఎంపీగా ఉంటూనే..గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. అటు పెద్దిరెడ్డి సోదరుడు తంబళ్ళపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. ఇలా పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైసీపీలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తుంది. ఇలా ప్రజలకోసం పనిచేస్తున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ..మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పక్కాగా గెలవడం ఖాయమని తేలిపోయింది.

పుంగనూరులో తిరుగులేని బలంతో ఉన్న పెద్దిరెడ్డి ..మళ్ళీ అక్కడ గెలవడం ఖాయం. పెద్దిరెడ్డి అనేక అక్రమాలు చేస్తున్నారని టి‌డి‌పి ఆరోపణలు చేస్తుంది..కానీ అవి తప్పు అని పుంగనూరు ప్రజలు నిరూపించనున్నారు. ఎంతో అభివృద్ధి చేసిన పెద్దిరెడ్డి వైపే ప్రజలు నిలబడనున్నారు. ఇక రాజంపేట ఎంపీగా మరోమారు మిథున్ రెడ్డి గెలిచి హ్యాట్రిక్ కొట్టనున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి రాజంపేట పార్లమెంట్‌ని అభివృద్ధి బాటపట్టించారు. పార్లమెంట్ లో రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. అందుకే మళ్ళీ మిథున్ రెడ్డి మళ్ళీ గెలవడం ఖాయం.

ఇక తంబళ్ళపల్లెలో ద్వారకానాథ్ రెడ్డికి ఎదురులేదు..గత ఎన్నికల్లోనే 47 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఈ సారి భారీ మెజారిటీ తోనే గెలవనున్నారు. మొత్తానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ ట్రిపుల్ ధమాకా కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version